
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -979 లో.......రాజు, లక్కీ కలిసి వెంకీని బ్లాక్ మెయిల్ చేసి పర్సు తీసుకొని వెళ్తారు. మరొకవైపు అక్క నువ్వు జాబ్ అన్నావ్ కదా నా ఫ్రెండ్ సంతోష్ కి నీ గురించి చెప్పాను .. వాళ్ళ బాస్ వచ్చాడంట లొకేషన్ పంపించాడు. నువ్వు వెళ్ళు అక్క అని ఇందుతో స్వాతి చెప్తుంది. ఇప్పుడు వెళ్తే రేఖ ఏదైనా అంటుందేమోనని అపర్ణ అంటుంది. ఎలాగైనా వెళ్ళాలి నానమ్మ.. ఇప్పుడు నాకు జాబ్ అవసరమని ఇందు అంటుంది. అక్క నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని స్వాతి చెప్పగానే ఇందు బయల్దేర్తుంది.
మరొకవైపు పబ్ కి ఐశ్వర్య తన ఫ్రెండ్స్ ని తీసుకొని వస్తుంది. అదే పబ్ కి కొంతమంది స్మగ్లర్స్ ని పట్టుకోవడానికి ఇన్ఫార్మర్ గా నందు కూడా వస్తుంది. ఐశ్వర్య నందు చూసుకోకుండా డాష్ ఇచ్చుకుంటారు. సారీ అని నందు చెప్తుంది అయినా ఐశ్వర్య వినిపించుకోకుండా పొగరుగా మాట్లాడుతుంది. ఇందు కూడా లొకేషన్ చూస్తూ అదే పబ్ కి వస్తుంది. అక్కడ వాతావరణం చూస్తే ఇందుకి నచ్చదు. ఇందు దగ్గరికి సంతోష్ వచ్చి తన బాస్ రాకీ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తనని చూసి రాకీ భలే ఉందని తేడాగా చూస్తాడు.. తనని కూర్చొపెట్టి మాట్లాడతాడు. సంతోష్ ని రాకీ అక్కడ నుండి పంపిస్తాడు. ఇందు ఇబ్బందిపడుతుంది..అదే పబ్ లో లక్కీ బేరర్ తో గొడవ పెట్టుకుంటాడు. రాజు వచ్చి ఆపుతాడు.
మరొకవైపు నందు ఇన్ఫార్మర్ గా వచ్చి అక్కడున్న స్మగ్లర్ ను చూసి వాళ్లకు డౌట్ రాకుండా అటుగా వెళ్తున్న వెంకీతో కలిసి డాన్స్ చేస్తుంది. నువ్వు బొకే అమ్మాయివి కదా అని వెంకీ అంటాడు. అదే కానీ ఇప్పుడు నాతో డాన్స్ చేసినట్లు యాక్టింగ్ చెయ్యమని నందు అంటుంది. మరొకవైపు ఇందు పబ్ లో ఇబ్బందిపడుతుంది. రాకీ చూపు ప్రవర్తన బట్టి ఇందుకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






