Home

»

Tv News

Podharillu : చక్రికి పడిన పోలీస్ దెబ్బ.. మహా కోసం దాచిన డబ్బుతో ఊహించని రచ్చ!

Jun 17, 2026 10:05AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -137 లో... చక్రిని మహా ఇంటికి రమ్మని చెప్తుంది. అంత మీ ఇష్టమేనా అని చక్రి అనుకుంటాడు. ఆ తర్వాత చక్రి ఇంటికి వెళ్తుంటే ఒక అతను బైక్ పై రాంగ్ రూట్ లో వచ్చి కార్ కి తగిలి కిందపడిపోతాడు. చక్రి కార్ దిగి చూసుకోవాలి కదా అని అంటాడు. నీదే తప్పు అని అక్కడున్న వాళ్ళు చక్రిని అంటారు. అతను పోలీసులకి కాల్ చేస్తాడు. చక్రి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక మాధవకి ఫోన్ చేసి జరిగింది చెప్తాడు  

దాంతో మాధవ వెళ్తుంటే నేను వస్తానని మహా అంటుంది. అక్కడ డబ్బు అవసరం పడుతుందని చక్రి దాచుకున్న డబ్బుని కేశవ తీసుకొని వస్తాడు. స్టేషన్ కి వెళ్తారు. అక్కడ అతను కోర్ట్ కి వెళ్ళాల్సిందే అంటాడు. అప్పుడే కార్ ఓనర్ ఓంకారేశ్వర్ వస్తాడు. మళ్ళీ ఏం పని చేసాడని మాధవతో అంటాడు. మాధవ జరిగింది చెప్పగానే.. అతను లోపలికి వెళ్లి కాంప్రమైస్ చెయ్యాలని ట్రై చేస్తాడు. యాబై వేల డబ్బులు కావాలని అతను అడుగుతాడు. దాంతో మాధవ దగ్గర కొంత డబ్బు కేశవ తెచ్చిన డబ్బు ఇంకా కార్ ఓనర్ కొంతడబ్బు అందరు కలిసి యాభై వేలు అతనికి ఇస్తారు. ఆ తర్వాత చక్రి పొగరుగా చూస్తాడు. ఏంట్రా రౌడీలాగా ఆ షర్ట్ బటన్స్ పెట్టుకోమని ఇన్‌స్పెక్టర్ అంటాడు. కోపంగా షర్ట్ బటన్ పెట్టుకొని పొగరుగా చూస్తుంటే ఏంట్రా అంత పొగరు అని చక్రిని ఇన్‌స్పెక్టర్ కొడుతాడు. చక్రి లైసెన్స్ తీసుకొని నెల రోజులకి వచ్చి తీసుకొని వెళ్ళమని అంటాడు. ఇది నీ పొగరుకి నేను వేస్తున్న శిక్ష అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. అక్కడ ఉంటే గొడవ అవుతుందని చక్రిని అక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. ఇంటికి వచ్చాక నా తప్పు లేదు అయినా డబ్బు కట్టారని చక్రి కోప్పడతాడు.

ఆ తర్వాత చక్రి పర్సులో డబ్బు లేదని కేశవని అడుగుతాడు. ఆ డబ్బుతోనే నిన్ను విడిపించిందని కేశవ అనగానే ఈ డబ్బు ఎందుకు దాచానో తెలుసు కదా ఎందుకు తీసావ్ రా అని ఇద్దరు గొడవ పడుతారు. అప్పుడే మహా వచ్చి ఆపండి అంటుంది. ఎవరు వినకపోవడంతో ప్లేట్ విసిరేస్తుంది. తరువాయి భాగంలో ఎన్నటి నుండో తనకి స్కూటీ అన్నావ్ కదా అని  చక్రికి కేశవ స్కూటీ చూపిస్తాడు. మహాకి సర్ ప్రైజ్ కి చక్రి స్కూటీ కొంటాడు. అది చూసి మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com