.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -296 లో..... సుధా, విశ్వ శ్రీమంతం కోసం వస్తారు. విశ్వతో రాఘవ, పెద్దసారు, రుద్ర మాట్లాడుతారు. విశ్వ జరిగింది ఏం మనసులో పెట్టుకోకు.. నిన్ను మనుషులు పెట్టి కొట్టించింది నేనే.. అన్నయ్యకి ఏం తెలియదని విశ్వతో రాఘవ అంటాడు. మీరు ఇప్పుడు ఎంత బాగా మాట్లాడినా జరిగింది మర్చిపోను ఇక్కడికి నేను రావడానికి కారణం సుధా.. ఇక తను మీకు దూరంగా వస్తానంటేనే ఇక్కడికి వచ్చానని విశ్వ అంటాడు. పెద్దసారు ఏదో మాట్లాడబోతుంటే పెద్దనాన్న ఇప్పుడు ఏం వద్దు తర్వాత అని రుద్ర అంటాడు.
ఆ తర్వాత ప్రీతీని ఆశీర్వదించడానికి సుధా స్టేజి పైకి వెళ్తుంటే కావాలనే ఇషిక డాష్ ఇస్తుంది. ఏంటి మమ్మల్ని ఇలా అవమానించడానికి పిలిచారా అని జయ (నిషా )అంటుంది. మేం అంత గమనిస్తున్నాం.. ప్రతీచోట అవమానిస్తున్నారు.. మా నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదని జయ అంటుంది. దాంతో శకుంతల కోప్పడుతుంది. ఆగండి.. నేను జయతో మాట్లాడుతానని రుద్ర అంటాడు. అసలు రెస్పెక్ట్ ఎక్కడ ఇవ్వలేదని రుద్ర అడుగుతాడు. తను ఈ ఇంటికి అల్లుడు జోక్ వేసి భుజంపై చెయ్ వెయ్యలేం.. అది మేం తనకి ఇచ్చే రెస్పెక్ట్ అని రుద్ర అంటాడు. అవును నా స్పేస్ నాకు ఉండాలని విశ్వ అంటాడు. అయిన నువ్వు ఏంటి ఎవరో కుటుంబం గురించి పూసగుచ్చినట్లు, చెప్పినట్లు గొడవ చెయ్యాలని అనుకున్నావని రుద్ర అంటాడు. అందరికి సారీ చెప్పమని జయతో విశ్వ అనగానే తను సారీ చెప్తుంది. ఆ తర్వాత అందరూ ప్రీతీని ఆశీర్వదిస్తారు.
ఆ తర్వాత ఇక వచ్చిన పని అయింది పదా వెళదాం.. నేను కార్ దగ్గర వెయిట్ చేస్తానని విశ్వ బయటకు వస్తాడు. సుధా తన వాళ్ళతో మాట్లాడి బయటకు వస్తుంది. ఇంకా కాసేపు ఉంటే మా వాళ్ళకి తృప్తి అయ్యేది అయినా అన్ని మీకు నచ్చినట్లు జరగాలని సుధా అనగానే ఏంటి అమ్మ.. వాళ్ళ గురించి నాన్నని అంటున్నావని జయ అంటుంది. నీకు సెన్స్ ఉందా మేం మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో వస్తున్నావ్.. అసలు నువ్వు నా కూతురివేనా ఒక్కటి కూడా మంచి ప్రవర్తన లేదు.. రేపు మాట్లాడుకుందాం.. నీ గురించి నాకు అన్ని తెలియాలని విశ్వ అంటాడు. జయ నువ్వు కార్ లో కూర్చోమని సుధా అంటుంది. ఏంటండి ఆ మాటలు అని సుధా అనగానే.. అవును అమ్మగారు.. ఎవరో చెప్పింది నమ్మి మీ కూతురు అనుకుంటున్నారు.. అన్నీ తెలుసుకోవాలి కదా అని పైడిరాజు, లక్ష్మి అంటారు. మరొకవైపు జయ కావాలనే గొడవ చేసింది.. అసలు సుధా అత్తయ్య కూతురు కాదని అనిపిస్తుందని రంగా, గంగలతో రుద్ర అంటాడు. అవును కాదని రంగా అంటాడు. ఆ తర్వాత రంగా కవర్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
