హోస్టింగ్ నేను చేస్తే బాగుంటుందన్నారు.. ప్రదీప్ చేంజ్ అవలేదన్న నిధి!
on Jan 1, 2026

బిబి జోడి సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. "ఇక నుంచి మీ సండే నైట్స్ ఇంకాస్త ఎంటర్టైనింగ్ గా మారబోతున్నాయి. ఎందుకంటే మా బిబి జోడి సీజన్ 2 లో ధమాకా జోడీలు దుమ్ము దులపడానికి సిద్ధంగా ఉన్నారు" అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చాడు.
"ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లు వస్తుంటాయి" అంటూ ప్రదీప్ మానస్ జోడీకి చెప్తుండగా మణికంఠ మధ్యలో వచ్చి "హోస్టింగ్ నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు" అంటూ మణికంఠ చెప్పాడు. "నువ్వు వేరే వాళ్ళ అకౌంట్ లో కామెంట్స్ చదివి ఉంటావ్" అన్నాడు ప్రదీప్. "మీరింత బాగా డాన్స్ చేస్తారని తెలీదు. మా దాంట్లో ఐటెం సాంగ్ ఉంది చేస్తారంటే " అంటూ ధనరాజ్ ఒక విషయం చెప్పేసరికి మానస్ "వ్వావ్" అన్నాడు. జడ్జ్ శ్రీదేవి అతని ఎక్స్ప్రెషన్ చూసి "ఒకసారి మళ్ళీ చూపించండి ఆ ఎక్స్ప్రెషన్" అని అడిగింది. "వ్వావ్ చాలా ఉంది ధమాకా జోడీస్ కి" అని కౌంటర్ ఇచ్చింది.
తర్వాత స్టేజి మీదకు రాజా సాబ్ ముగ్గురు హీరోయిన్స్ వచ్చారు. "కొత్త సంవత్సరం జాతకంలో మంచి కలర్ ఫుల్ గా ఉంటుంది అంటే ఏంటో అనుకున్నాను" అంటూ బాగా ఫ్లర్ట్ చేసాడు. "ప్రదీప్ గారు మీరేం చేంజ్ అవలేదు కదా " అంటూ నిధి అగర్వాల్ ప్రదీప్ మీద డైలాగ్ వేసింది. "అస్సలు చేంజ్ అవలేదు" అంటూ శేఖర్ మాష్టర్ కోరస్ ఇచ్చాడు. "కానీ మీరు అందరికీ సేమ్ థింగ్ చెప్తారు" అంటూ నిధి మళ్ళీ ప్రదీప్ మీద కౌంటర్ వేసింది.
తర్వాత "బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్" థీమ్ మీద మానస్ - స్రష్టి వర్మ చేసిన డాన్స్ కి జడ్జెస్ ఫిదా ఇపోయారు. జడ్జ్ శ్రీదేవి గోల్డెన్ రోజ్ ఇచ్చింది. ఈ థీమ్ కి పక్కా న్యాయం చేశారు అంటూ శేఖర్ మాష్టర్ చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



