.webp)
స్టార్ మా టీవీలో ప్రసరమావుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -506 లో.... ప్రేమ నర్మద, ధీరజ్ కలిసి వల్లికి లై డిటెక్టర్ మెషిన్ పెడుతారు. వల్లి అబద్ధం చెప్పినప్పడు రాంగ్ అన్నట్టుగా ఆ మెషిన్ గట్టిగా అరుస్తుంది. నీ కడుపులో బిడ్డ ఉందా లేదా అని నర్మద అడుగుతుంది. ఉందని వల్లి చెప్పగానే అది గట్టిగా నో అని అరుస్తుంది లేదు అనగానే ఆల్ రైట్ అని చెప్తుంది. ఎంటే నీ కడుపులో బిడ్డ లేదా అని వేదవతి అడుగుతుంది. లేదని అంటుంది. మిషన్ అరిచేసరికి అవునని లేదని వల్లి అంటుంది.
ఈ మెషిన్ అంతా అబద్ధం చెప్తుందని వల్లి దబాయించినట్లు మాట్లాడుతుంది. ఆ తర్వాత నీ కడుపు సంగతి ఎలా బయటపెట్టాలో నాకు తెలుసని నర్మద అనుకుంటుంది. ఆ తర్వాత ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారని సుకన్య, వల్లి అనుకుంటారు. అప్పుడే ధీరజ్, ప్రేమ, నర్మద వెళ్తారు. నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలని తయాత్తు తీసుకొని వచ్చామని అంటారు. వద్దని వల్లి అంటుంది. అప్పుడే అక్కడికి చందు వస్తాడు. వాళ్ళు అంత ప్రేమగా ఇస్తుంటే కట్టుకోమని చందు అంటాడు. వల్లి తయాత్తు కట్టుకుంటుంది. అయ్యో కండిషన్స్ చెప్పడం మర్చిపోయాను.. రాత్రంతా పడుకోవద్దు.. ఒకవేళ అబద్ధం చెప్పి మోసాలు చేస్తే రక్తం కక్కుకొని చచ్చిపోతారని ధీరజ్, నర్మద చెప్పగానే వల్లి రాత్రంతా పడుకోదు.. ఇక రాత్రి వల్లి వాటర్ తాగుతుంది. అందులో ప్రేమ వాళ్ళు కలర్ నీళ్లు కలుపుతారు. అవి తాగి సింక్ లో ఉమ్మేస్తుంది వల్లి.. ఆ రంగు నీళ్లు చూసి అయ్యో రక్తం అని వల్లి భయపడుతుంది. ఇక సుకన్యని పిలిచి అడుగగా అదేం లేదని హ్యాపీగా పడుకోవచ్చని వల్లితో సుకన్య చెప్తుంది. రాత్రంతా తను నిద్రపోదు సుకన్యని నిద్ర పోనియ్యదు.
ఆ తర్వాత ఏంటి అక్క నువ్వు అబద్ధం ఏం చెప్పలేదు కదా ఎందుకు భయం.. అదంతా వట్టిగనే చెప్పామని నర్మద చెప్తుంది. నేను చెప్పాను.. వాళ్ళు నీతో ఆడుకుంటున్నారని సుకన్య అంటుంది. ఆ తర్వాత వల్లి అక్క నీకు ఫీవర్ గా ఉంది హాస్పిటల్ కి వెళదామని నర్మద అంటుంది. వద్దు అని వల్లి అంటుంది.. వద్దు అంటుంది కదా వదిలేయండి అని వేదవతి అంటుంది. అయినా వినకుండా వల్లిని నర్మద తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
