.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం '(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -705 లో.....అసలు ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయించింది జ్యోత్స్ననే అని కార్తీక్ తో కాంచన అంటుంది. లేదు తనే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంది.. నన్ను కూడా వద్దు అంది అని దీప అంటుంది. మరి ఆ వైరాగాడు అయి ఉంటాడా లేక దక్షిణామూర్తి అయి ఉంటాడా అని కాంచన అంటుంది. అవన్నీ ఏం ఆలోచించకని కార్తీక్ అంటాడు. కాంచన ఫోన్ లో ఏదో చూస్తూ ఉంటే అప్పుడే దీపకి ఆర్డర్ ఇచ్చిన బాలరాజు ఏదో వీడియో చేస్తూ కన్పిస్తాడు. ఆ ఫోన్ కార్తీక్ తీసుకొని వీడు బాలరాజు కదా.. అయితే వీడు ఆర్టిస్ట్ ఆ అని అనుకుంటాడు.
బాలరాజు తన షూటింగ్ చేసే ప్లేస్ కి కార్తీక్ వెళ్లి.. అబ్బా సూపర్ చేశారు సర్ అని అంటాడు. మీరు మారువేశంలో వచ్చిన ప్రొడ్యూసర్ కదా అని కార్తీక్ ని బాలరాజు అంటాడు. ఆ మాటని కార్తీక్ క్యాచ్ చేసుకొని అవును మీరు బాగా యాక్టింగ్ చేస్తున్నారు.. నా నెక్స్ట్ మూవీలో మీరే హీరో అని కార్తీక్ అంటాడు. నేను చెప్పిన లొకేషన్ కి రండీ లైవ్ పర్ఫామెన్స్ ఉంటుందని కార్తీక్ చెప్పగానే అతను సరేనని అంటాడు. మరొకవైపు సూరజ్య దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. ఎప్పటిలాగే ఇద్దరు మాటలతో యుద్ధం చేసుకుంటారు. అక్కడికి కార్తీక్, దీప వస్తారు. ఎందుకు వచ్చారని జ్యోత్స్న అడుగుతుంది. తాతకి పచ్చడి తినాలనిపిస్తుందంట అందుకే దీప పచ్చడి చెయ్యడానికి వచ్చిందని కార్తీక్ అనగానే ఎలాగూ ఈవినింగ్ తర్వాత నీ డ్యూటీ ఇదే కదా అని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత కార్తీక్ దీప లోపలకి వెళ్తారు. దీప సాయంత్రం నువ్వు సీఈఓ కాదన్న విషయం తెలిస్తే ఫీల్ కాకు అని పారిజాతం అనగానే అంత ఖచ్చితంగా దీప సీఈఓ కాదని ఎలా చెప్తున్నావ్.. మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసారా అని కార్తీక్ అంటాడు.
మావయ్య గారు ఇందులో ఎవరు తప్పు చేసిన క్షమించకండి... అది దీప అయినా జ్యోత్స్న అయిన సరే అని శివన్నారాయణతో సుమిత్ర చెప్తుంది. మరోవైపు ఆఫీస్ కి వెళ్లి టేబుల్ క్లీన్ చెయ్ సాయంత్రం సీఈఓ అయ్యేది నేనే అని క్లర్క్ తో జ్యోత్స్న అంటుంది. అప్పుడే సూరజ్ వచ్చి ఎందుకు అంత కాన్ఫిడెంట్ ఉన్నావని సూరజ్ అంటాడు. ఇప్పటికైనా నాతో చేతులు కలుపు.. నా ప్రతీ రెస్టారెంట్ లో స్టాల్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తానని జ్యోత్స్న అంటుంది. నాకు ఒక ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని సూరజ్ అంటాడు. ఏంట్రా ఏదో కోటీశ్వరుడి మనవడిలాగా చెప్తువని జ్యోత్స్న అంటుంది. నువ్వు ఆలోచించుకో డోర్స్ ఓపెన్ ఉంటాయని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

