Home

»

Tv News

Brahmamudi : ఇందు మీద రేఖ ఫైర్.. బొకే షాప్ లో నందు!

Mar 11, 2026

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -976 లో..... ఇందు ఎగ్జామ్ రాసి ఇంటికి వస్తుంది. దారిలో రేఖ కన్పించడంతో ఇంటికి వచ్చాక ఎక్కడికి వెళ్లావని ఇందుని రేఖ అడుగుతుంది. టైలర్ షాప్ కి అని ఇందు చెప్తుంది. అవును తనని స్వాతి పంపించిందని భ్రమరాంబ చెప్తుంది. అయిన సరే.... నువ్వు వెళ్లినా షాప్ పేరేంటి అని రేఖ అడుగగా ఇందు చెప్తుంది. టైలర్ నెంబర్ ఇవ్వమని రేఖ అనగానే స్వాతి షాక్ అవుతుంది. స్వాతి నీ దగ్గర అతని నెంబర్ ఉంటుంది కదా ఇవ్వు అని అనగానే స్వాతి ఇస్తుంది. అతనికి ఫోన్ చేసి రేఖ అడుగుతుంది. స్వాతి మేడమ్ డ్రెస్ తీసుకొని ఇందు మేడమ్ వచ్చిందని చెప్పగానే ఇందు రిలాక్స్ అవుతుంది. నేను చెప్పింది నిజమని ఇప్పటికైనా నమ్ముతారా ఆంటీ అని ఇందు అంటుంది.

సరే నువ్వు వెళ్ళు అని రేఖ అనగానే ఎందుకు ఆంటీ నేను బయటకు వెళ్తే మీరు అంత కంగారుపడుతున్నారని ఇందు అడుగుతుంది. ఏంటే నువ్వు నాకు ఎదురు మాట్లాడుతున్నావని రేఖ కోప్పడుతుంది. ఆ తర్వాత ఏంటి రేఖ చిన్నదానికి ఇంత రియాక్ట్ అయ్యావని భ్రమరాంబ అడుగుతుంది. ఈ
ఇంకా కొన్ని రోజుల్లో ఆస్తి మన సొంతం అవుతుంది. ఇప్పుడు అది మన చెయ్ జారిపోకూడదని రేఖ అంటుంది. సరే నేను చూసుకుంటా అని భ్రమరాంబ అంటుంది. ఆ తర్వాత ఇందు, అపర్ణ, స్వాతి మాట్లాడుకుంటారు. భళే మేనేజ్ చేసావ్ అక్క అని ఇందుతో స్వాతి అంటుంది. ఎగ్జామ్ అయ్యాక టైలర్ దగ్గరికి వెళ్లి స్టిచ్చింగ్ చేయించుకొని వచ్చానని ఇందు చెప్తుంది.

ఎలాగోలా చదువు పూర్తి అయింది. పాపం నందు ఇక్కడే ఉంటే దాని చదువు కూడా పూర్తి అయ్యేదని అపర్ణ బాధపడుతుంది. ఆ తర్వాత అప్పు, కళ్యాణ్ కూతురు నందు చిన్నపుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఒక కానిస్టేబుల్ ఇంట్లో ఉంటుంది . పెద్దయ్యాకా బొకే షాప్ రన్ చేస్తూ చదువుకుంటుంది. అప్పుడే తన లవర్ కి లవ్ ప్రపోజ్ చెయ్యడానికి బొకే కోసం రాజు తమ్ముడు వెంకి తన దగ్గరికి వచ్చి బొకే కొంటాడు. నందు తన షాప్ దగ్గర కొన్ని కవితలు రాసుకొని గోడకి అంటిస్తుంది. అవి వెంకి చదువుతాడు. వెళ్లి తన లవర్ కి బొకే ఇచ్చి ఆ కవిత చెప్తాడు. అమ్మాయి సిగ్గుపడుతూ వెళ్తుంది. అప్పుడే వెంకి దగ్గరికి నందు వచ్చి.. నా కవిత ఎందుకు చెప్పావ్ కవితకి డబ్బు ఇవ్వు అని డబ్బు తీసుకొని వెళ్తుంది. మరొకవైపు సుభాష్ కీ నడుము నొప్పిగా ఉంటే డాక్టర్ వచ్చి ట్రీట్ మెంట్ ఇచ్చి ఆపరేషన్ చెయ్యాలని చెప్తాడు. తరువాయి భాగంలో రేఖ బిజినెస్ పార్టనర్ ఇంటికి డిన్నర్ కి వస్తాడు. ఇందు చేసిన వంటలు నచ్చి తనని వాళ్ళ ఇంటికి పంపమని అడుగుతాడు. అందుకు అపర్ణ ఒప్పుకోదు. రేఖ సరే అంటుంది. ఇందు కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com