Home

»

Tv News

నైనికకి ఫోన్ చేసిన డైరెక్టర్ సుకుమార్... అమరదీప్ ఫుల్ ఖుషీ

Mar 11, 2026

బిబి జోడి నెక్స్ట్ వీక్ ప్రోమో వచ్చేసింది. ఈ వారం మాస్ రౌండ్ థీమ్ తో రాబోతోంది. ఇందులో ముందుగా అమరదీప్ - నైనికా వచ్చి ఫుల్ ఎనెర్జీతో డాన్స్ చేశారు. "కు కు కుమారి... స్టెప్పమార్ ...జరీ జరీ  పంచె కట్టు " వంటి అన్ని సాంగ్స్ కి డాన్స్ చేశారు. "స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డాన్స్ డాన్స్ డాన్స్" అంటూ శేఖర్ మాష్టర్ కాలర్ పైకి లేపాడు. "దుమ్ము లేపి దంచి కొట్టారు " అంటూ సదా ఫుల్ జోష్ తో చెప్పింది. "జరీ జరీ అనే మా బావ సాంగ్ ని వాడి ముందు చేయడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది " అన్నాడు అమరదీప్. ఇంతలో మానస్ కూడా వచ్చి వాళ్ళతో కలిసి డాన్స్ చేసాడు. "ఓన్లీ సూపర్ స్టార్ సాంగ్స్ కె డేడికేట్ చేస్తారు చిన్నదెక్కడో ఉండిపోతుంది " అని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత అమర్ ని హగ్ చేసుకున్నాడు. "చాలా హ్యాపీగా ఉంది కొరియోగ్రఫీ చేసినావిడతో డాన్స్ పార్టనర్ గా చేస్తున్నాను. కొరియోగ్రఫీ చేస్తున్న ఆయన ఎదురుగా ఉంటున్నాను. నా సాంగ్ కి అమర్ డాన్స్ చేసాడు. నాకు ఇంతకంటే ఎం కావాలి థ్యాంక్యూ బిబి జోడి " అన్నాడు మానస్.

"నేను వచ్చి ఒక విషయం చెప్పాలి. ఇంతకన్నా మంచి  సందర్భం రాకపోవచ్చు. నేను నెక్స్ట్ డైరెక్ట్ చేయబోతోంది అమర్ తోనే " అని చెప్పాడు ధనరాజ్.  సూపర్ అంటూ శేఖర్ మాష్టర్ చెప్పాడు. బిబి జోడి డైరెక్టర్స్ స్పెషల్ లో అమర్  చేసిన పెర్ఫార్మెన్స్ ని శేఖర్ మాష్టర్ డైరెక్టర్ సుకుమార్ కి చూపించిన విషయాన్నీ ప్రదీప్ చెప్పాడు. ఇంతలో ఫోన్ చేసి సుకుమార్ మాట్లాడారు.

ఇక నైనికా - అమరదీప్ కి మాటలు రాలేదు. "హలో అమర్ చాల బాగా బాగుంది బాగా చేసావ్. నైనికా ఎలా మూవ్  అవుతున్నావ్ అసలు " అంటూ మాట్లాడారు. "ఎంత గొప్ప రోజు. సుకుమార్ గారి దగ్గర నుంచి ఫోన్ రావడం బావ పాటకు నువ్వు పెర్ఫార్మ్ చేయడం నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఇక్కడికి వచ్చి హీరో నువ్వని అనౌన్స్ చేయడం" అంటూ ప్రదీప్ చెప్తూ వెళ్ళాడు ." బిబి జోడి స్టేజి కలిసొచ్చిందయ్యా " అంటూ అమరదీప్ ఫుల్ ఖుషీ అయ్యాడు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com