Home

»

Tv News

Godhavari : నందు పెళ్లిచూపుల్లో కట్నకానుకల రచ్చ.. సింహాద్రి అసలు స్కెచ్ ఇదేనా?

May 27, 2026 11:39AM


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -14 లో..... సింహాద్రి తనకి తెలిసిన NRI సంబంధాన్ని పెళ్లిచూపులకి తీసుకొని వస్తాడు. శంకర్ దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నందు రెడీ అవ్వడానికి చీర చూస్తుంటే అది చిరిగి ఉంటుంది. ఈ పని ఎవరు చేసారో నాకు తెలుసని పెద్దావిడని పిలిచి ఈ చీర ఎందుకు చింపావని కోప్పడుతుంది. నేను కాదని ఆవిడ అంటుంది కానీ నిజానికి తనే చీర కత్తిరిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చెయ్యలేమని నందుకి మురళి కొన్న చీర తీసుకొని వచ్చి అక్క ఇది కట్టుకొని రా అని జానూ చెప్తుంది. వేరే దారి లేక నందు కట్టుకొని రెడీ అవుతుంది . శంకర్ ఇంటికి మురళి వస్తాడు. తను నా మేనల్లుడు అని పెళ్లిచూపులకు వచ్చిన వాళ్ళకి పరిచయం చేస్తాడు. మరి అతనికే ఇవ్వొచ్చు కదా అని వాళ్ళ అడుగుతారు. అంటే ఇప్పుడు మేనవాళ్లని చేసుకోవడం లేదు కదా అని మురళి కవర్ చేస్తాడు.

ఆ తర్వాత అబ్బాయి తన ఫ్రెండ్ అయిన సూర్యని తీసుకొని పెళ్లిచూపులకి వస్తాడు. శంకర్ ఇంటికి పెళ్లిచూపులకి వస్తున్నామని సూర్యకి వచ్చేవరకు తెలియదు. లోపలికి వస్తారు. నందు అందరికి జ్యూస్ ఇస్తుంది. అమ్మాయి నచ్చిందా అని అక్కడ అడుగుతారు. నేను నా ఫ్రెండ్ తో మాట్లాడాక చెప్తానని అబ్బాయి అరవింద్ చెప్తాడు. సూర్యని పక్కకి తీసుకొని వెళ్లి వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పురా అంటాడు. ఈ ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకోవాలంటే అదృష్టం ఉండాలని సూర్య అంటాడు. ఆ మాటలు జానూ విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత అరవింద్ లోపలకి వచ్చి నాకు ఈ కుటుంబం బాగా నచ్చిందని చెప్తాడు. ఆ తర్వాత అమ్మాయి ఇంకా అబ్బాయి పక్కకి వెళ్లి మాట్లాడుకొండి అని పంపిస్తారు. కాసేపటికి మీ అమ్మాయికి బంగారం పెట్టె వస్తువులన్నీ పెడుతారు కానీ మీరు కొన్న తోట కూడా కావాలని అబ్బాయి తండ్రి అడుగుతాడు. దాంతో శంకర్ షాక్ అవుతాడు. అలా ఎలా అడుగుతారు.. ఉన్నది మొత్తం ఒక అమ్మాయికి ఇస్తే మిగతా అమ్మాయిలున్నారు కదా అని సింహాద్రి అంటాడు. తోట మొత్తం కాకుండా సగం ఇవ్వమని  అడుగుతారు. దాంతో శంకర్ ఒప్పుకుంటాడు.

మీరు పెళ్లికి గంగ  రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్ని నాకు ఇవ్వాలి లేదంటే మండపం నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందని అబ్బాయి వాళ్ళు అంటారు. తరువాయి భాగంలో సింహాద్రి తన అసలు రూపం బయటపెడతాడు. తన ఫ్రెండ్స్ తో డ్రింక్ చేస్తూ ఆ శంకర్ డబ్బు పంపిస్తే తోటని నాపేరున కొన్నానని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com