నాగబాబు అసలు నువ్వేమనుకుంటున్నావ్? అవినాశ్ వార్నింగ్
on Jul 6, 2022
'పార్టీ చేద్దాం పుష్ప' పార్ట్ 1 ఒక రేంజ్లో దుమ్ము లేపేసింది. ఇక ఇప్పుడు పార్ట్ 2 ప్రోమో రెడీ ఐపోయింది. ఈ ఎపిసోడ్లో ఎవరికీ వారే పోటా పోటీగా పెర్ఫార్మ్ చేశారు. ఈ స్కిట్ లో నాగబాబుకి అవినాష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాడు. అవినాష్ తండ్రిగా.. జీవన్ కొడుకుగా ఒక స్కిట్ చేశారు. జీవన్ కి ఒక కల వచ్చింది. "నాగబాబుకి అవినాష్ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు కల వచ్చింది" అని చెప్పాడు జీవన్. తన కొడుకు కలను నెరవేర్చడం కోసం ఏదైనా సరే చేస్తానని గట్టిగా తీర్మానించుకుంటాడు తండ్రి అవినాష్. "ఆ కలను నెరవేర్చావంటే నీ ప్రాణం పోతుంది" అంటూ అవినాష్ కి అనసూయ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. "నా కొడుకు కోసం ఏమైనా చేస్తాను" అంటూ అవినాష్ చాలా సీరియస్ గా అనసూయతో చెప్పాడు.
ఇక అదే ఊపుతో స్టేజి మీదకు వచ్చి చిటికె వేసి "మిస్టర్ నాగబాబు ఏమనుకుంటున్నావ్ అసలు నువ్వు.. ఏంటా లుక్కు.. ఇది కరెక్ట్ కాదు.. ఇది కరెక్ట్ కాదు." అంటూ గట్టిగా అరిచాడు అవినాష్. అవినాష్ అరుపులకు స్టేజి మొత్తం అవాక్కైపోతుంది. నిజంగానే ఏదో జరగబోతున్న సెన్స్ అనేది క్రియేట్ అయ్యింది. కానీ ఆ అరుపులకు తెర దింపుతూ ఫైనల్ గా "ఇదే కరెక్ట్" అంటూ నాగబాబు కాళ్ళు పట్టుకున్నాడు అవినాష్. ఇక ఈ ఎపిసోడ్ లో దీపికా పిల్లి అద్భుతమైన డాన్స్ చేసేసరికి "పిల్లి అనుకుంటివా పులి" అంటూ అనసూయ అదిరిపోయే డైలాగ్ చెప్తుంది. ఈ ప్రోమో ఎండింగ్ లో సుధీర్ చేసిన డాన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇలా ఈ వారం ఎపిసోడ్ అలరించబోతోంది.
Also Read