Home

»

Tv News

గుప్పెడంత మనసు 2 లో త్వరలో కనిపిస్తాం... చెప్పిన ముఖేష్, రక్షా

Aug 2, 2026 12:43PM

"ముఖేష్ ,  రక్షా ఫ్యాన్స్  వాళ్ళను ఎదగాలన్న ప్రశ్నలను పరివారం పోస్ట్ బాక్స్ కి పంపించారు. ఇంతకు ఆ లెటర్స్ లో ఏముంది ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి...దానికి మీ సమాధానాలు ఏంటి అని తెలుసుకునే టైం వచ్చేసింది. " అని చెప్పింది శ్రీముఖి.  ఫస్ట్ లెటర్ ని చదవమని హరికి ఇచ్చింది శ్రీముఖి. "కాకినాడ నుంచి కాజా ఆంటీ రాశారు. ముఖేష్ , రక్షా అంటే నాకు చాలా చాలా ఇష్టం. కొన్నేళ్లుగా నేను వాళ్ళ కంబినేషన్ ని మిస్సవుతున్నాను. ఐతే ఇప్పుడు వాళ్లిద్దరూ ఒకే దగ్గర కనిపించారు కాబట్టి ఒకటి తెలుసుకోవాలని ఉంది. ఇద్దరూ కలిసి మళ్ళీ ఎప్పుడు నటిస్తారు. ఎందులో నటిస్తారు " అని అడిగారు.

"గుప్పెడంత మనసు 2 లో స్టార్ మాలో త్వరలో కనిపిస్తాం " అని చెప్పారు రక్షా, హరి. "అంటే పార్ట్ 2 చేయండి అని చెప్పబోతున్నాం " అని చెప్పింది రక్షా. "విజయవాడ నుంచి విరాజిత గారు రాశారు. ముఖేష్ రక్షని ఎత్తుకోవాలని ఏదైనా మూవీలో సీన్ రే-క్రియేట్ చేయాలని" అని రాసారు. దాంతో గీతగోవిందం సాంగ్ రి-క్రియేట్ చేశారు. అప్పుడు అవినాష్ "హరి కృతిక నన్ను ఎత్తుకోమంటోంది . " అంటూ స్టోరీ చెప్పాడు. "రాజమండ్రి నుంచి రంభ ఆంటీ రాశారు. ఏమని అంటే ముఖేష్ - రక్షతో సీరియల్ తీసినట్టు కృత్తికా - హరితో ఎందుకు తియ్యకూడదు " అని రాశారు.

"సామర్లకోట నుంచి సమీరా రాసారు. ముఖేష్ - రిషి కన్నా రిషి - వసుధారా అంటే ఇష్టం. నేను ఆ క్యారెక్టర్స్ కి ఎప్పుడో కనెక్ట్ ఐపోయాను. సో రిషి - వసుధారా క్యూట్ గా లవ్ ప్రొపోజ్ చేసుకుంటే చూడాలని ఉంది " అని రాసింది. వెంటనే రిషి - వసుధారా లవ్ ప్రొపోజ్ చేసుకున్నారు. వసుధారా ఐతే కవిత కూడా చెప్పింది. "అమ్మాయిల్లో ఉంది షి.  ఆకాశంలో ఎగురుతుంది పక్షి. నీలో ఉంది ఖుషి. నువ్వు నా లైఫ్ లోకి వస్తే ఫుల్ ఖుషి. నువ్వు అడిగితే నేను ఇస్తాను నా గుండె కోసి. ఐ లవ్ యు రిషి సర్" అని రోజ్ ఇచ్చింది వసుధారా. వెంటనే రిషి సర్ "లవ్ లో పడ్డా నీ కళ్ళు చూసి " అంటూ ఆ కవితను పూర్తి చేసాడు" . ఇలా ఇద్దరూ లవ్ ప్రొపోజ్ చేసుకున్నారు క్యూట్ గా.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com