కళ్యాణ్ పడాల అంటే చాలు సైనికుడే గుర్తొస్తాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 9 కామన్ మాన్ కేటగిరీ లో సీజన్ టైటిల్ ని గెలుచుకుని ఆడియన్స్ మనస్సులో నిలిచి పోయాడు. ఇప్పుడు రకరకాల టీవీ షోస్ లో కనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. కవర్ సాంగ్స్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నాడు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష దాటుకుని వచ్చినా కళ్యాణ్ నెక్స్ట్ సీజన్ వాళ్లకి టిప్స్ ఇస్తూ ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"నేను మీ కళ్యాణ్ పడాల .మీ లాగే కామన్ మాన్. దేశానికి సర్వీస్ చేసే ఒక చిన్న ఉద్యోగం. ఒక హ్యాపీ లైఫ్. కానీ నాకంటూ ఒక కల మంచి యాక్టర్ అవ్వాలని , సెలబ్రిటీ గా మారాలని. ప్రొఫెషన్ సరే, కాని ప్యాషన్.... కళ్ళ ముందే కలలన్ని ఆవిరి ఐపోతున్నాయేమో అనిపిస్తుంది. కదల్లేని కథగా మారిపోతానేమో అనిపించింది, ఓడిపోతానేమో అన్ని భయమేసింది. ఓటమిని ఒప్పుకోవాలనిపించ లేదు. ఆఖరి ప్రయత్నం చెయ్యాలనిపించింది. రిస్క్ తీసుకున్న.... టార్గెట్ పెట్టుకున్న.... అటువైపుగా అడుగేసా.... నన్ను నేను మోటివేట్ చేసుకున్న.... క్రింద పడ్డ.... పైకి లేచా.... ఫైట్ చేశా.... గెలిచా.... ఈ స్థాయిలో నిల్చున్న .
"సో ఇది నా సక్సెస్ స్టోరీ. మామూలు మనిషి నుండి సెలబ్రిటీ గా మారిన స్టోరీ. కామెంట్ చేసిన వాళ్ళతోనే కాంప్లిమెంట్స్ తెప్పించుకున్న స్టోరీ. నా స్టోరీ లాగే ప్రతీ ఒక్కరి స్టోరీ స్టోరీలో ఒక అగ్ని పరీక్ష ఉంటుంది. మరి ఈ అగ్నిపరీక్షకి మీరు సిద్ధమా.'' అంటూ కంటెస్టెంట్స్ కి గూస్ బంప్స్ తెప్పించే తన స్టోరీ చెప్పి మోటివేట్ చేసాడు . మరి అగ్నిపరీక్షకి సిద్దమవుతున్న కంటెస్టెంట్స్ కి ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో ఎవరూ చెప్పలేరు.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బిగ్ బాస్ టైటిల్ విన్నర్ సక్సెస్ స్టోరీ... గూస్ బంప్స్ డైలాగ్స్‌తో అదరగొట్టాడు
Aug 2, 2026 12:46PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




