Home

»

Tv News

మూవీ ఆఫర్లపై మౌనీషా చౌదరి బోల్డ్ కామెంట్స్!

Jun 19, 2026 4:34PM

సోషల్ మీడియాలో మౌనీషా చౌదరి అంటే తెలియని వాళ్ళు లేరు. ఆమె ఫేమస్ మోడల్, ఇన్ ప్లూయెన్సర్ కూడా. ఇక రీసెంట్ గా ఆమె కిస్సిక్ టాక్  షోకి వచ్చింది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. "ఒక పెద్ద రియాలిటీ షో కోసం మీరు హైదరాబాద్ వచ్చారంట " అని హోస్ట్ అడిగేసరికి "అందరూ అదే అడుగుతున్నారండి " అని చెప్పింది. "లాస్ట్ సీజన్ వైల్డ్ కార్డుల అడిగారు" అని అంది. "మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసిన ఆ  కామెంట్ ఏంటి " అని అడిగింది. "ఒకటా రెండా మీరు చూసే ఒక 30 నిమిషాల రీల్ లో నా పిల్లను పెంచుతున్నానా లేదా అని ఎలా డిసైడ్ చేస్తారు.

నా మదర్ హుడ్ మీదకు వచ్చేసరికి నాకు సుర్రుమంటాది. నాకు సబ్స్క్రిప్షన్ ఉంది కానీ అందులో ఎం లేదండి .  " అని అంది. "అసలు మన తెలుగులో మీకు మూవీ ఆఫర్స్ వచ్చాయా " అని అడిగింది హోస్ట్. "కొన్ని మూవీ ఆఫర్స్ వచ్చాయండి ఐతే మీ బాడీ కొలతలు ఎంత నీ తొడల సైజ్ ఎంత" అని అడిగారు. "నాకు ఇండియా టూరిజమ్ యాడ్  అని చెప్పి ఒకరు రీచ్ అయ్యారు. వాళ్ళు ఆడిషన్ కి రావడమే ఒక మినీ స్కర్ట్ క్రాప్  టాప్ వేసుకుని రండి అని చెప్పారు. ఇండియా టూరిజమ్ కి మినీ  స్కర్ట్ క్రాప్  టాప్ కి  సంబంధం ఏముంది ? హీరోయిన్ అవ్వాలంటే బాడీ కొలతలు ఇవన్నీ ఎందుకండీ ? నటన వచ్చా రాదా అని అడగండి ఫస్ట్ ..రాదు అంటా ఆ సరే దొబ్బెయ్ అనాలప్పుడు అంతే ఐపోతుంది. " అని చెప్పింది.

నా లైఫ్ ని మార్చింది ఏంటంటే 2021 లో నేను ప్రెగ్నెంట్ కి అప్పుడు నా కొడుకును కోల్పోయాను. రెండు నెలల్లో కొడుకు పుడుతున్నాడని తెలిసినప్పుడు హార్ట్ బీట్ ఆగిపోయింది. అప్పుడే నేను దేవుడు లేడు అనుకున్నా ఉంటే ఇంత కష్టపెట్టడు అనుకున్నా. ఒక టైంలో జీవితం మీద హోప్స్ వదిలేసుకున్న. దేవుడు ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు " అనేది నా మైండ్ లో ఉంది అంటూ తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com