Home

»

Tv News

అలాంటి సిగ్గులేని బతుకు అవసరమా?.. ఆది పరువు తీసేసిన రెజీనా!

Jun 19, 2026 11:41AM

ఢీ షో లేటెస్ట్ ఎపిసోడ్స్ ఐతే ఆది హడావుడితో ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. రెజీనాని కాపాడడానికి ఆది హీరోగా ఒక ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వీడియోని క్రియేట్ చేస్తే ఇప్పుడు మరో ఎపిసోడ్ లో రెజీనాని ఎలా పడేయాలి అనే దానిపై విజయ్ బిన్నీ మాష్టర్ సలహా తీసుకున్నాడు ఆది. "మాష్టర్ మీరేదో సెకండ్ ఛాన్స్ అని ఒక గొప్ప ప్రయత్నం చేసారు. నాకు అది బాగా నచ్చింది. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదామనుకుంటున్నా. రెజీనాను పడేయడానికి మనకు కూడా ఒక సెకండ్ ఛాన్స్ ఉంటుందా ఏంటి." అని అడిగాడు అది. "నీకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వలేదు. ఇంకా సెకండ్ ఛాన్స్ ఏంటి " అంటూ అడిగాడు బిన్నీ మాష్టర్. "మీ అంత గ్లామర్ గా ఉండాలంటే ఎం చేయాలి" అని అడిగాడు ఆది. "ఒక పని చేయాలి. పొద్దున్నే లేచి " అని చెప్పేంతలో "ఎవరెవరికో బీట్ వేయాలా" అన్నాడు ఆది. "అది కాదు ఇప్పుడు టిఫిన్ చేసాక " అని మళ్ళీ చెప్పేంతలో "అప్పుడు బీటేయాలి ఎవరెవరికో కంపల్సరి" అన్నాడు ఆది. "అది కాదయ్యా సాయంత్రం 5 తర్వాత" అనేసరికి " 5 తర్వాత అంటే వెయ్యాల్సిందే " అన్నాడు ఆది. "ఎవరో ఒకళ్లకు బీట్ వేయందే నువ్వు ఆగవా.

అందుకే ఆవిడ నీకు ఫస్ట్ ఛాన్స్ కూడా ఇవ్వలేదు " అన్నాడు బిన్నీ మాష్టర్. "సర్సర్లే లేడీ గెటప్ వేస్తె మీకు కూడా బీట్ వేస్తాను " అన్నాడు ఆది. "మనలో మన మాట మొన్న జతిన్ గాడు లేడీ గెటప్ లో ఎలా ఉన్నాడు " అని అడిగాడు ఆది. "సరే ఫైనల్ గా ఒక్కటి చెప్పండి ఆవిడ పడాలంటే నేనేం చేయాలి " అని అడిగాడు ఆది. "కొన్ని టిప్స్ చెప్తాను ఫాలో అవ్వు రెజీనా ఈజీగా పడిపోతుంది" అన్నాడు బిన్నీ మాష్టర్. "రెజీనాను తప్ప ఇంకో అమ్మాయిని చూడకూడదు" అనేసరికి "అబ్బా అది నా కళ్ళు నా మాట వినవు మాష్టర్ " అన్నాడు ఆది. "నిన్న కూడా ఒక అమ్మాయి లవ్ చెయ్యి లవ్ చెయ్యి అని అడుక్కుంటూ వెళ్లి పక్కనున్న అడుక్కునేదాన్ని లవ్ చేశా" అన్నాడు ఆది. "రెజీనా గారి ముందు ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఎం అనకూడదు. అలా నవ్వుతూ ఉండాలి. పడిపోద్ది" అన్నాడు.

వెంటనే "ఏంటి రెజీనా ఏంటి విశేషాలు " అనుకుంటూ వెళ్ళిపోయాడు ఆది. "అరేయ్ ఎదవన్నర ఎదవా " అని తిట్టాడు నందు. దానికి నవ్వుతూ ఉన్నాడు ఆది. "ఏంటి ఆది తిడుతున్నారు " అని రెజీనా అనేసరికి "ఈ తిట్లన్నీ మనకు కామన్ రెజీనా " అన్నాడు. "అసలు తిట్టడం కాదన్నా రెండు దెబ్బలెయ్యి " అంది ఫైమా. నందు రెండు తన్నులు తన్నాడు. "ఇవన్నీ కామన్ రెజీనా పట్టించుకోను. నువ్వు నా లవ్ ని యాక్సెప్ట్ చేయాలంటే ఎలా " అని అడిగాడు ఆది. "ఇలా తిడితే తిట్టించుకునే వాడు కొడితే కొట్టించుకునే వాడు నాకు అస్సలు ఇష్టం లేదు. ఐనా అలాంటి సిగ్గులేని బతుకు అవసరమా మీకు  " అని చెప్పేసింది రెజీనా.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com