వైల్డ్ ఫైర్ తో కిర్రాక్ సీత...
on Dec 5, 2024
కిర్రాక్ సీత బేబీ మూవీతో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ కి వెళ్ళొచ్చింది. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక ఇంకా పాపులర్ అయ్యింది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. 7ఆర్ట్స్ యూట్యూబ్ చానెల్‌లో తనదైన కామెడీ, ఫన్నీ వీడియాలతో ఆకట్టుకునేది సీత..ఈ ఛానెల్ ద్వారా ఆమెకు కొంత గుర్తింపు వచ్చింది. కానీ బేబీ మూవీతో ఇప్పుడు జనాలందరికీ తెలిసింది. అలాంటి సీత వైల్డ్ ఫైర్ తో ఫోటో దిగి ఆ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది. "ఐకానిక్ స్టార్ తో ఫోటో దిగడం నిజంగా అనుకోలేదు. ఎం నటించారు సర్ మూవీలో.. బేబీ మూవీలో నా యాక్టింగ్ బాగుంది అని మీరు చెప్పడం నిజంగా ఐకానిక్ మెమరీ నాకు.
ఈ సందర్భాన్ని నేనెప్పుడూ మర్చిపోను" అంటూ పోస్ట్ పెట్టింది. ఇక నెటిజన్స్ ఐతే ఫైర్ ఎమోజిస్ పెట్టి సీతను ఎంకరేజ్ చేస్తున్నారు. సీత పుట్టింది నంధ్యాలలో. అక్కడే స్కూలింగ్ పూర్తి చేసి హైదరాబాద్ ఉప్పల్లో సెటిల్ అయ్యింది. ఐతే అనూహ్యంగా బేబీ మూవీతో ఆమె క్రేజ్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. బేబీ సినిమా తర్వాత మళ్లీ అంతటి గొప్ప అవకాశం సీతకు రాలేదు.. మరి బిగ్ బాస్ కి వెళ్లివచ్చిన వాళ్లకు ఎంతో కొంత లక్ కలిసి వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.. మరి సీత విషయంలో ఎలాంటి అవకాశాలు భవిష్యత్తులో వస్తాయో చూడాలి.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)