అమ్మ కల కోసం బిగ్ బాస్ కి నబీల్.. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అదేనంట!
on Dec 5, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో రోజుకొకరు ఓట్ అప్పీల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది ముగియడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇక నిన్నటి టాస్క్ లో నబీల్ గెలిచి ఓట్ అప్పీల్ కి అర్హత సాధించాడు. ఓట్ అప్పీల్ లో నబీల్ ఏం చెప్పాడో ఓసారి చూసేద్దాం.
నేను మీ నబీల్ అఫ్రిది.. నేను ఒక సామాన్యుడిని సినిమాల్లో యాక్టర్ అవ్వాలి స్టార్ అవ్వాలని కలలు కన్నా.. చాలా ఆడిషన్స్ ఇచ్చా కానీ ఎక్కడా అవకాశం రాలే.. వీళ్లు వాళ్లు ఏంది నాకు అవకాశం ఇచ్చేదని నా అవకాశం నేనే క్రియేట్ చేసుకున్నా.. మా అమ్మ ఫోన్‌తో వీడియోలు చేయడం స్టార్ట్ చేశా సోషల్ మీడియాలో.. మా అమ్మ నాన్న అన్నలు ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల కష్టపడి మస్త్ వీడియోలు చేశా.. ప్రతివారం వీడియోలు చేశా.. దాని వల్ల నాకు కొంచెం డబ్బులు, కొంచెం ఫేమ్ కొంచెం నేమ్ వచ్చింది.. కానీ అప్పుడు కూడా నాకు అవకాశాలు రాలేదు.. 2016 నుంచి ఇప్పటివరకూ అంటే 9 ఏళ్ల నుంచి వీడియోలు చేస్తనే ఉన్నా.. నా మొత్తం లైఫ్‌లో నాకు దొరికిన ఏకైక అవకాశం.. పెద్ద అవకాశం బిగ్‌బాస్ అంటూ నబీల్ చెప్పాడు.
ఇక్కడకి అడుగుపెట్టేటప్పుడే అనుకున్నా విన్నర్ అయ్యే బయటికి వెళ్లాలి.. ట్రోఫీ కొట్టే బయటికెళ్లాలని.. మా అమ్మ కోరిక.. నువ్వు ఒకవేళ ఆ హౌస్‌లో నుంచి బయటికి అడుగుపెడితే నాగ్ సార్ చేయి పట్టుకొని ఆ హౌస్‌లో లైట్లు బంద్ అయినప్పుడే అడుగుపెట్టాలని అన్నది.. నేను బయట లైఫ్‌వో ఎలా ఉన్నానో నా పర్సనాలిటీ ఎట్లనో అలానే ఉందాం.. తప్పయితే తప్పు కరెక్ట్ అయితే కరెక్ట్ చెప్తాదమని చెప్పి.. నిర్భయంగా నిర్మొహమాటంగా నిష్పక్షపాతంగా నేను నాలాగ ఉన్నా నా డెసిషన్స్ నేను ఇండివీడ్యూవల్‌గా తీసుకున్నా అండ్ ప్రతి టాస్కులో నా 100 పర్సంట్ ఇచ్చినా.. ప్రాణం పోతే పోనీ కానీ టాస్కు గెలవాలని ఆడా.. ఇక్కడ 14వ వారం నుంచి 15వ వారంలోకి వెళ్తున్నా అంటే నా కృషితో పాటు మీ అందరి లవ్, సపోర్ట్, ఓట్స్ వల్లే.. మరోసారి అందరికీ థాంక్యూ.. మీ అందరికీ ధన్యవాదాలు.. పాదాభివందనాలు.. అందరికీ.. ప్రస్తుతం నేను విన్నర్ ట్రోఫీకి ఒకే ఒక్క మెట్టు దూరంలో ఉన్నాను.. ప్లీజ్ నా కోసం వెయిట్ చేయండి.. నాకు మీ సపోర్ట్ చాలా ముఖ్యం.. నా లైఫ్‌లో ఇదే బిగ్గెస్ట్ అచ్చీవ్‌మెంట్ అవుతుంది.. అంటూ నబీల్ చెప్పాడు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)