సుధీర్ మీతో డాన్స్ చేయనని ఏ అమ్మాయి అంటుంది చెప్పు.. క్యూ కడతారు అమ్మాయిలు
on Jul 23, 2025
.webp)
బుల్లితెర మీద నిఖిల్ - కావ్య పెయిర్ అంటే ఇష్టపడని ఆడియెన్స్ అంటూ ఎవరూ లేరు. సుధీర్ - రష్మీ జోడిని ఎంతగా ఇష్టపడతారో నిఖిల్ - కావ్య జోడిని అంతకంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఏమయ్యిందో ఏమో కానీ నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లే సమయంలో కావ్యతో బ్రేకప్ అయ్యింది. ఇద్దరూ విడిపోయారు. సోషల్ మీడియాలో కూడా వేరైపోయారు. షోస్ లో కూడా ఎక్కువగా నిఖిల్ తప్ప కావ్య కనిపించడం లేదు. కానీ సర్కార్ నెక్స్ట్ వీక్ ప్రోమోకి కావ్య మంచి హాట్ డ్రెస్ లో వచ్చి సుధీర్ తో డాన్స్ చేసింది. "కొత్త కొత్తగా ఉన్నది" అనే సాంగ్ కి సుధీర్ - కావ్య మంచి సింక్రనైజేషన్ తో స్టెప్స్ వేశారు. " ఎం స్టెప్పులేయాలా ఏంటా అని ఆలోచించే లోపలే నువ్వు ఇరగ్గొట్టి అవతల పెట్టావ్" అన్నాడు సుధీర్ కావ్యని పొగుడుతూ. "మీరు పక్కన ఉన్నారు కాబట్టే నేను అలా చేయగలిగాను" అని చెప్పింది కావ్య.
దాంతో వెనక బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో లడ్డూ కావాలా నాయనా అంటూ సుధీర్ ని ఉద్దేశించి ఒక యాడ్ వచ్చింది. "ఇంకో సాంగ్ కి కూడా మనిద్దరం డాన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తోంది" అంటూ సుధీర్ కావ్యని అడిగాడు. "మీతో డాన్స్ చేయను అని ఏ అమ్మాయి అంటుంది" అంటూ కావ్య సుధీర్ ని ఆకాశానికి ఎత్తేసింది. "ఏ నాయనా మరో లడ్డూ కావాలా" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో మళ్ళీ ఒక వాయిస్ వినిపించింది. "నాకసలు మాములుగా అమ్మాయిలు ఎందుకు పడరో చెప్పండి" అని సుధీర్ కావ్యని అడిగాడు. "మీరు ఊ అంటే క్యూలో ఉంటారు" అంటూ చెప్పింది. "ఆ క్యూ ఎక్కడ ఉంటుందో తెలిస్తే నేనే వెళ్ళేవాడిని కదా" అని నవ్వాపుకోలేక కౌంటర్ వేసాడు సుధీర్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



