Home

»

Tv News

Karthika Deepam2 : సూరజ్ కి నిజం చెప్పిన కార్తీక్.. మహిని కాలర్ పట్టుకొని గెంటేశాడుగా!

Nov 12, 2026 3:32PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2' (Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ - 827 లో.. రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేస్తూ ఆఫీసులో క్లయింట్ హెడ్ మహి అసభ్యంగా అన్న మాటలను తలుచుకుని జ్యోత్స్న బాధపడుతుంటుంది. మనసు, మనిషి ఒక్క చోట ఉంటేనే దాన్ని సాల్వ్ చేయగలవని సుమిత్ర వచ్చి అంటుంది. ఆఫీసులో జరిగిన దాని గురించి ఇంట్లో మాట్లాడతారు. ఏం జరిగిందని జ్యోత్స్నను అందరు అడుగుతారు. కానీ ఏం జరగలేదని చెప్పి జ్యోత్స్న తప్పించుకోవాలనుకుంటుంది. అయితే కార్తీక్ జరిగింది మొత్తం చెప్తాడు. రేపటి లోపు సంజాయిషీ ఇచ్చుకోకపోతే రాజీనామా చేయాల్సిందేనని సూరజ్ అన్నాడని కార్తీక్ చెప్తాడు. ఇంత గుడ్ న్యూస్ ఇంత లేటుగా చెబుతావేంట్రా, రేపటి నుంచి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని శివనారాయణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ జ్యోత్స్న మాత్రం ఆఫీసుకు వెళ్తానని, సూరజ్‌కే సమాధానం చెప్తానని అంటుంది.

 

నీ తప్పు లేకపోతే మాటలు పడవు, కానీ అన్ని మాటలు పడ్డావంటే ఏమైనా తప్పు చేశావా అని జ్యోత్స్నను దీప అడుగుతుంది. జ్యోత్స్నను సూరజ్ తిట్టడంపై సుమిత్ర, పారిజాతం ఫైర్ అవుతారు. ఆఫీసులో అరగంట పాటు కనిపించకుండా జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందనే విషయం తెలియాలని కార్తీక్ అంటాడు. ఆఫీసు విషయాలు ఇంట్లో మాట్లాడలేను, నాకేం కాలేదు, బాగానే ఉన్నా, ఆఫీసులో సూరజ్‌తోనే మాట్లాడతా, నా సమస్యను సాల్వ్ చేసుకోగలనని చెప్పి జ్యోత్స్న లోపలికి వెళ్లిపోతుంది.మరోవైపు జ్యోత్స్నపై లేనిపోని నిందలు వేస్తూ దక్షిణామూర్తి మనసును మార్చాలని మాలిని ప్రయత్నిస్తుంది. జ్యోత్స్న మీ శత్రువు, మీరు తప్పు చేశారు మామయ్య అని మాలిని అంటుంది. ఇదే సమస్యను జ్యోత్స్న వైపు నుంచి చూడాలని దక్షిణామూర్తి అంటాడు.జ్యోత్స్న మౌనం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని సూరజ్ మనసు మార్చడానికి ప్రయత్నిస్తాడు.

 

ఉదయం ఆఫీసులో సూరజ్ ప్రజెంటేషన్‌కు క్లయింట్ చప్పట్లు కొడతాడు. జ్యోత్స్నను జాబ్‌లో నుంచి తీసేశారా అని మహి అడుగుతాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. నిన్న మీటింగ్‌కు రాకుండా జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందని సూరజ్ మళ్లీ అడుగుతాడు. కానీ తాను చెప్తానని ఆఫీస్ బాయ్ నానిని కార్తీక్ పిలుస్తాడు. జ్యోత్స్న చేయిని మహి పట్టుకోవడం, కోరిక తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించడం గురించి నాని చెప్తాడు. అది విని అందరు షాక్ అవుతారు. నా మీద ఇలాంటి ఆరోపణలు ఏంటని మహి డ్రామా స్టార్ట్ చేస్తాడు. మాలిని కూడా ఆ క్లయింట్‌కే సపోర్ట్ చేస్తుంది. మధ్యలో సూరజ్ జోక్యం చేసుకుంటాడు. కార్తీక్ చెప్పేది నిజమా కాదా అని జ్యోత్స్నను సూరజ్ అడుగుతాడు. నిజమేనని జ్యోత్స్న చెప్తుంది. సంస్థ అనేది కుటుంబం లాంటిది, ఓ అతిథి వచ్చి ఆడపిల్లను వేధిస్తే ఆ ఇంటి యజమానిని అవమానించినట్లు కాదా అని కార్తీక్ ఆవేశంగా మాట్లాడి జ్యోత్స్నను తీసుకుని బయటకు వెళ్తాడు. కార్తీక్ మాటలతో సూరజ్ రెచ్చిపోతాడు. మహి ముఖం మీద ఫైల్ కొట్టి కాలర్ పట్టుకుని బయటకు గెంటేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com