.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -628 లో.. ఫుల్‌గా తాగిన చందును ఇంటికి ఆటోలో తీసుకెళ్తుంది అంజలి. తనకు అంజలినే కావాలంటాడు చందు.. తనకు తోడుగా ఉండాలని అంజలి భుజంపై పడుకుంటాడు. ఇటు వల్లిని ఇంటికి తీసుకొస్తానని మాట ఇవ్వడంపై నర్మదపై ప్రేమ సీరియస్ అవుతుంది. తప్పు చేస్తున్నావక్కా, మంచితనం ఉండొచ్చు కానీ మరీ మనం మునిగిపోయేంత ఉండొద్దని ప్రేమ అంటుంది. అప్పుడే వచ్చిన వేదవతి కూడా ప్రేమకే సపోర్ట్ చేస్తుంది. కానీ ధీరజ్ మాత్రం నర్మదకు సపోర్ట్ చేస్తాడు. నర్మద వదిన ఊరికే మాట ఇవ్వొద్దని, మీరు ఏమన్నా కూడా వల్లి వదినను నర్మద వదిన ఇంటికి తీసుకొచ్చి తీరుతుందని ధీరజ్ అంటాడు. చందు బావ గురించి ఆలోచించే వల్లిని ఇంటికి తీసుకొస్తానంటున్నా, వల్లి అక్కకు చందు బావ అంటే పిచ్చి ప్రేమ అని నర్మద అంటుంది. ఈ మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టప్పలా కాపలా కాస్తున్నానని నర్మద కౌంటర్ ఇస్తుంది.
ట్రావెల్ ఆఫీసుకు చిన్నోడు పేరు పెట్టాలి కదా అని బౌల్లో తిరుపతి కొన్ని చిట్టీలు తెస్తాడు. చిట్టీలు అవసరం లేదు, తన పేరే పెడతాడని ప్రేమ అనగానే వేదవతి కోపంతో చూస్తుంది. ఈ పేరు విషయంలో ప్రేమ, వేదవతి గొడవ పడతారు. ఈ తింగరబుచ్చికి అంత సీన్ లేదమ్మా, అమ్మను మించిన దైవం లేదమ్మా, ఎప్పుడూ అమ్మ పార్టీనే అని వేదవతిని ధీరజ్ ప్రేమగా హగ్ చేసుకుంటాడు. ప్రేమకు కోపం వస్తుంది. ట్రావెల్స్ ఆఫీసుకు తన పేరే పెట్టాలని ప్రేమ అంటుంది. చిట్టీలు తీద్దామని నర్మద అంటే అందుకు ప్రేమ, వేదవతి ఒప్పుకుంటారు. కానీ అన్ని చిట్టీల మీద తన పేరే ప్రేమ రాసి చీటింగ్ చేస్తుంది. వేదవతి చిట్టీ తీస్తుంది, అందులో ప్రేమ పేరు చూసి షాక్ అవుతుంది. తన పేరు వచ్చిందని ప్రేమ ఎగిరి గంతులేస్తుంది. అప్పుడే నర్మదకు డౌట్ వచ్చి మిగతా చిట్టీలు చూస్తే అన్నింటిపై ప్రేమ అనే పేరు ఉంటుంది. వేదవతి, నర్మద కలిసి ప్రేమ చెవులు పిండుతారు.
ఇటు మళ్లీ విశ్వ, అమూల్య సీక్రెట్‌గా కలుసుకుంటారు. మా పెద్దన్నయ్య తరపున నీకు సారీ చెప్తున్నారా అని అమూల్య చెప్తుంది. నా బతుకు గుడిలో గంటలా మారింది, మీ అన్నయ్యకు విడాకులు ఇప్పించి రెండో పెళ్లి చేస్తారా అని విశ్వ అంటాడు. వెంటనే అమూల్య లాగిపెట్టి కొడుతుంది. చిన్న బావ జీవితమంతా ఇక ఆనందమే అని విశ్వ గంతులేస్తాడు. అప్పుడే ధీరజ్ బయటకు వస్తాడు. చిన్నయ్యను చూసి అమూల్య టెన్షన్ పడి విశ్వను నెట్టేసి వెళ్లిపోతుంది. పెద్దోడి కోసం ధీరజ్ టెన్షన్ పడుతుంటే అప్పుడే ఆటో వస్తుంది.అందులో నుంచి చందును తీసుకుని అంజలి దిగడంతో ధీరజ్‌కు మైండ్ బ్లాక్ అవుతుంది. మీ అన్నయ్యకు ఎంత దూరంగా ఉందామనుకున్నా సరే టైమ్ మళ్లీ కలిపింది, మా ఇంటి ముందు మీ అన్నయ్య తాగి పడిపోయాడని అంజలి అంటుంది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





