
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం2'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -834 లో కార్తీక్, దీపలు పారిజాతాన్ని బయటకు తీసుకొచ్చి జ్యోత్స్న జీవితాన్ని ఎందుకు నాశనం చేశావని నిలదీస్తారు. సూరజ్ ముందు జ్యోత్స్న పరువు తీసేశావ్.. క్యారెక్టర్ తీసేశావని ఇద్దరూ గొడవ పడతారు. దానికి పారిజాతం అంతా కావాలనే చేశానని సమాధానమిస్తుంది. ఈ దెబ్బతో సూరజ్ జ్యోత్స్న దగ్గరకు రాడు.. ఇద్దరూ శాశ్వతంగా దూరం అయిపోతారని తన ప్లాన్ చెప్తుంది. నీకు కొంచెం కూడా పాపం అనిపించడం లేదా అని దీప అడిగితే పాత జ్యోత్స్నలా మారే వరకు ఇలాగే చేస్తానని పారిజాతం అంటుంది. ఇక చాలు ఆపుతావా అని జ్యోత్స్న అరుస్తుంది. మనుషులు స్వార్థానికి వాడుకుంటారని పారు అంటుంది. వాడు కాదు నువ్వు నా లైఫ్ లో లేవు, చచ్చిపోయావని జ్యోత్స్న ఎమోషనల్ అవుతుంది. పాత జ్యోత్స్న రాదు.. ఒకవేళ వస్తే నన్ను చంపేస్తుందని బాధ పడుతుంది. ఆ మాటలు తలచుకొని, సూరజ్ తాళి పట్టుకొని ఇద్దరూ విడివిడిగా కుమిలిపోతారు.
ఇంట్లో జ్యోత్స్న ఎందుకు అలా ఉందని శివన్నారాయణ కార్తీక్ ని అడిగితే ఆఫీస్ లో గిట్టని వాళ్లు నింద వేశారని కవర్ చేస్తాడు. పారు వెటకారం చేస్తుందని చెప్పడంతో శివన్నారాయణ పారిజాతాన్ని తిడతాడు. జ్యోత్స్న భోజనం చేయకుండా వెళ్లిపోతుంటే దీప వెళ్లి ప్రేమగా తినిపిస్తుంది. అటు సూరజ్ ని కూడా తల్లి భోజనానికి పిలుస్తుంది, కానీ సూరజ్ బాధలోనే ఉంటాడు. మాలిని మనసులో తను అనుకున్నది జరుగుతుందని, కొడుకు జ్యోత్స్నని మర్చిపోతాడని అనుకుంటుంది. జ్యోత్స్న ఎలాంటిదో తెలిసిందని మాలిని అంటే ఎవరు ఎలాంటి వాళ్లో కాలమే చెప్తుందని దక్షిణామూర్తి అంటాడు. మాలిని కాఫీ ఇచ్చి మీరు నమ్మడం లేదా అని అడిగితే పారిజాతం అబద్ధం చెప్పిందనుకుంటే జ్యోత్స్న ఒక్క మాట కూడా అనలేదని దక్షిణామూర్తి అంటాడు. తన కలలన్నీ నాశనం అయ్యాయని దక్షిణామూర్తి బాధపడుతుంటాడు.
కార్తీక్, దీప ఇద్దరు రాత్రి ఒంటరిగా తమ జీవితం గురించి మాట్లాడుకుంటారు. అసలు నువ్వు ఎవరు.
ఎక్కడ ఉండాల్సిన దానివి, ఎలా బతకాల్సిన దానివి అని దీపని కార్తీక్ అడుగుతాడు. ఎక్కడ మొదలుపెట్టిన ప్రయాణం ఎక్కడ వరకు వచ్చిందని.. జీవితమే పీడకల అయిపోయిందని అంటాడు. మన గురించి మనం ఆలోచించుకునే నెలలు దాటిపోయిందని.. మనల్ని మనమే మర్చిపోయామని బాధపడతాడు. తాత ఆస్తుల్ని పోగొట్టుకుంటే మనం వాళ్లని పోగొట్టుకున్నామని ఎమోషనల్ అవుతాడు. దానికి దీప మనమంటే నువ్వు, నేను, శౌర్య మాత్రమేనని అంటుంది. ప్రేమ అనేది అందమైన పడవ లాంటిది.. మన పడవలో అందరికీ చోటుందని, అందులో జ్యోత్స్న కూడా ఉందని చెప్తుంది. సూరజ్ వచ్చి జ్యోత్స్నని మర్చిపోవాలనుకుంటున్నానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ లో ఉత్కంఠ ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

