Home

»

Tv News

Brahmamudi: ఇందూ, రాజ్ ఫస్ట్ నైట్.. రేఖ ఏం చేయనుంది!

Nov 20, 2026 10:25AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' . ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ - 1193 లో.... షార్ట్ కట్‌లో డబ్బులు సంపాదించాలని ఐశ్వర్య రెచ్చిపోతోంది. నేను సంతకం పెట్టొద్దని ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు.. నీ మీద గెలవటానికి తను ఏమైనా చేస్తుందని రాజ్ అంటాడు. నేను సంతకం పెట్టింది తనపై ప్రేమతో, నా మీద గెలిస్తే ఎంతో సంతోషించేదాన్ని, తను 

మారుతుందన్న నమ్మకం నాకుందని ఇందూ అంటుంది. నా భయం ఐశ్వర్య గురించి కాదు రఘువీర్ గురించి అని ఇందూ అంటే వాడికి అంత సీన్ లేదని రాజ్ అంటాడు. శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు.. పగ తీర్చుకోవడానికి అవకాశాలు వాడుకుంటాడని ఇందూ భయపడుతుంది.

 

ఉదయాన్నే తనకు కొరియర్ రావడంతో చలపతి షాక్ అవుతాడు. కవర్ ఓపెన్ చేసి చూడగా అందులో రాజ్ చిన్నప్పటి ఫోటోలు ఉండటం చూసి భార్యాభర్తలు షాక్ అవుతారు. ఈ ఫోటోలన్నీ ఎవరు తీశారు, మనకి ఎవరు పంపించారని టెన్షన్ పడతారు. రాజ్ మన కొడుకు కాదు, దుగ్గిరాల ఇంటి వారసుడని మనకు కాకుండా ఎవరికో తెలిసింది.. ఆ రేఖకు నిజం తెలిసుంటే మన బిడ్డకు ప్రమాదం జరిగేదని అనుకుంటారు. ముందు ఈ ఫోటోలు ఎవరు పంపించారో తెలుసుకోవాలనుకుంటారు.

 

అపర్ణ కిచెన్‌లో వంట చేస్తుండగా శేషం, రాజు వచ్చి ఇంట్లో పెళ్లి జరిగిన జంట ఉంది, వాళ్లకి జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయని చెప్తాడు. వీళ్ల మొదటి రాత్రి గురించి మాట్లాడుతున్నారా అని అపర్ణకు అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు వీళ్ల శోభనానికి తొందర ఏమొచ్చిందని అనడంతో రాజు, శేషం షాక్ అవుతారు. పంతులుగారిని అడిగొచ్చానని శేషం చెప్తాడు. ఇప్పుడు శోభనానికి తొందర లేదు.. ఆరు నెలల తర్వాత మంచి ముహూర్తం ఉందని ఇందూ అనడంతో రాజ్ షాక్ అవుతాడు. పెద్దవాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని రాజ్ చెప్పడంతో మనం 6 నెలల తర్వాత పెట్టుకుందామని ఇందూ అనడంతో రాజ్ ఉలిక్కిపడతాడు. ఆరు సంవత్సరాల తర్వాతైనా ఓకే అని నోరు జారడంతో అలాగే చేద్దామని అపర్ణ అనడంతో రాజ్ షాక్ అవుతాడు.

పిల్లలిద్దరూ వయసులో ఉన్నారు.. సరదాగా గడపాలని ముచ్చట పడుతున్నారు, ఆ శోభనం జరిగిపోతే వాళ్లకు పుట్టే పిల్లలతో ఆడుకుందామని శేషం అంటాడు. నా కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.. ఇప్పట్లో బిడ్డను ఇస్తుందన్న నమ్మకం నాకు లేదని ఎమోషనల్ అవుతాడు. సంవత్సరం తిరిగేసరికి నీ చేతిలో పాపనో, బాబునో పెడతానని రాజ్ మాటిస్తాడు. ఇందూని అడక్కుండానే మాటిచ్చేస్తావా అని అపర్ణ అడుగుతుంది, రాజు ఇచ్చిన మాటకు నేను కూడా ఓకే అని ఇందూ అనడంతో రాజు సిగ్గుపడతాడు. పంతులుగారు చెప్పినట్లే రేపే ముహూర్తం ఖాయం చేసుకుందామని అపర్ణ సరేనని అంటుంది. ఇందూ సిగ్గుపడుతూ బెడ్ రూంలోకి పరిగెడుతుంది.. ఆమె వెంటే రాజ్ కూడా వెళ్తాడు. శోభనం రోజు నీకు అసలైన ఇందూ ఏంటో తెలిసేలా చేస్తానని ఇద్దరూ సరదాగా కొట్టుకుంటారు.

భూషణ్, రేఖలు మాట్లాడుకుంటూ ఉండగా శేషం వచ్చి మనం ఇక్కడ ఏం చేసినా వాళ్ల మీద గెలవలేమని అంటాడు. రేపు రాత్రి ఇందూ, రాజ్‌లకు ఫస్ట్ నైట్, దానిని జరగనివ్వను, వాళ్లిద్దరూ ఒక్కటైతే నా మాట నడవదని రేఖ అంటుంది. వెంకీ ఆఫీసుకు వెళ్తుండటంతో నీకు జాబ్ ఎప్పుడొచ్చిందని చలపతి ప్రశ్నించడంతో వెంకీకి ముచ్చెమటలు పడతాయి. దుగ్గిరాల కంపెనీలో జాబ్‌కి వెళ్తున్నావా అని నిలదీస్తాడు, వెంకీ అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com