Home

»

Tv News

Karthika Deepam2 : జ్యోత్స్న మీటింగ్ కి రాకపోవడంతో డీల్ క్యాన్సిల్ చేసిన ఇన్వెస్టర్!

Nov 11, 2026 9:26AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -826 లో....పారిజాతం టిఫిన్ కొట్టు దగ్గర గల్లాపెట్టిలోని డబ్బులు నొక్కేస్తూ ఉంటే కార్తీక్ చూసి ఆపుతాడు. పెద్దాయనకు చెప్తాడు. పారిజాతం నువ్వు కూడా చేతివాటం చూపిస్తావా అని తిడతాడు. ఇక కార్తీక్ తనకి మీటింగ్ ఉందని మెసేజ్ వచ్చిందని చెప్పి వెళ్లిపోతాడు. పరువు తీశావ్‌రా అంటూ పారు అనుకుంటుంది.

సూరజ్, దీప, కార్తీక్, మాలినిలు ఇన్వెస్టర్లతో మీటింగ్‌లో ఉంటారు. జ్యోత్స్న రాలేదని అందరూ అనుకుంటారు. ఇన్వెస్టర్ కూడా జ్యోత్స్న ఇంకా రాలేదంటని అనుకుంటాడు.సూరజ్ ప్రజెంటేషన్ ఇవ్వబోతే ఫైల్ ఆర్డర్‌లో లేదు. జ్యోత్స్నకి పెట్టమంటే పెట్టలేదని అనుకుంటాడు. ఫైల్ పీఏ దగ్గర ఉందని మీటింగ్ రేపు పెట్టుకుందామని సూరజ్ అంటే.. డీల్ క్యాన్సిల్, మీ పీఏకి యాటిట్యూడ్ ఎక్కువ అని ఇన్వెస్టర్ గొడవ చేస్తాడు.సూరజ్ బతిమాలడంతో రేపు చూద్దామని చెప్పి వెళ్లిపోతాడు.

జ్యోత్స్న రాగానే సూరజ్ చాలా అరుస్తాడు. చెప్పకుండా ఎక్కడికి వెళ్లావ్.. ఫైల్ ఎక్కడ పెట్టావ్.. ఒక్క సంతకం పెట్టకుండా ఆయన డీల్ ఆపారు. చేసే పని మీద భయం భక్తి లేని నీ లాంటి పీఏని పెట్టుకున్న నాకు ఇలా జరగాల్సిందే అంటూ ఫైర్ అవుతాడు. మీటింగ్‌కి రాకుండా ఎక్కడికి వెళ్లావ్.. కళ్లు ఎందుకు అలా ఏడ్చినట్లు ఉన్నాయని అడుగుతాడు. దీప, కార్తీక్ కూడా ఏమైందని అడుగుతారు.జ్యోత్స్న మాత్రం సైలెంట్‌గా ఉంటుంది. వీళ్లంతా ప్లాన్ చేసుకుని నాటకాలు ఆడుతున్నారని మాలిని అంటుంది. చివరికి సూరజ్ సీరియస్‌గా.. నేను నోటీస్ జారీ చేశాను. జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలి.. లెటర్ రాస్తుందో రాజీనామా చేస్తుందో తన ఇష్టం అంటాడు. నేను తప్పు చేశాను క్షమించండి అని జ్యోత్స్న అంటే రేపటి వరకు నీకు టైమ్ అని సూరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com