Home

»

Tv News

Illu Illalu Pillalu : అంజలి కోసం చందు ఎమోషనల్.. రామారాజుకి తెలుస్తుందా!

Nov 11, 2026 9:23AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ - 627 లో.. అంజలి చందుని తలచుకుని నువ్వు వద్దనడం వల్లే నా జీవితం ఇలా అయ్యిందని ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు చందు ఫుల్లుగా మందు తాగి వల్లీ నన్ను మోసం చేసిందని తూగుతూ వచ్చి అంజలి ఇంటి ముందు పడిపోతాడు. కేక విని బయటకు వచ్చిన అంజలి చందుని చూసి షాక్ అవుతుంది. నువ్వు నిజంగా నా అంజలివేనా, కలలోకి వచ్చావా అని చందు అనడంతో అంజలి ఆటో పిలిచి వాడిని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తుంది.

రామరాజు ఇంట్లో అందరు భోజనాలు చేస్తుంటారు. ధీరజ్ లేటుగా రావడంతో వేదవతి ప్రేమను గొడవ గురించి అడుగుతుంది. తర్వాత రామరాజు సాగర్‌కి డబ్బు కావాలేమో అడగమంటే సాగర్ వద్దంటాడు. భోజనం తర్వాత ధీరజ్ రామరాజుకి ఒక లెటర్ ఇస్తాడు. అందులో రామరాజు దగ్గర 30 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు, వడ్డీతో సహా తీరుస్తానని రాసుంటుంది. మీరు అప్పుగా ఇచ్చానంటేనే తీసుకుంటానని ధీరజ్ అనడంతో రామరాజు ఆ ప్రామిసరీ నోట్ తీసుకుని బీరువాలో పెట్టమని వేదవతికి ఇస్తాడు.

మరోవైపు భద్రావతి, రామరాజు, ధీరజ్ చేతిలో మళ్లీ ఓడిపోయానని వాళ్లని దెబ్బకొట్టాలని రేపు భాగ్యాన్ని రమ్మని చెప్పమని సేనాపతికి చెప్తుంది. ఆటోలో వెళ్తున్న చందు.. నా జీవితంలో లేవు అంజలి కలలో అయినా ఉండు, నువ్వు నాతో ఉంటా అంటే దూరం చేసుకున్నా, ఇప్పుడు నేనే అడుగుతున్నా నాతో ఉండిపోమని ఎమోషనల్‌గా అంటాడు. దీంతో అంజలి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com