English | Telugu
Home  » TV News

ఇది నా జీవితానికి క్లైమాక్స్ కాదు, ఇంటర్వెల్ మాత్రమే.. మోనిత కాన్ఫిడెన్స్‌!

on Sep 20, 2021

 

పరిణామాలు అన్నీ తన ఊహలకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పటికీ... కార్తీక్ మీద మోనితకు ఉన్న మోజు చావలేదు. కార్తీక్ కుటుంబంలో తనకు స్థానం దక్కుతుందనే ఆశ పోలేదు. తన కడుపులో బిడ్డకు కార్తీక్ తండ్రి అని ఇప్పటికీ బలంగా వాదిస్తోంది. తనకు శిక్ష పడినప్పటికీ.. తనపై ఆత్మ విశ్వాసంతో, చిరునవ్వుతో కటకటాల్లోకి వెళ్లింది. 'కార్తీక దీపం' సీరియల్ ఈ రోజు (సెప్టెంబర్ 20, 2021) 1149 ఎపిసోడ్‌లోకి ఎంటరైంది. నేడు ఏం జరిగిందంటే...

మోనితను కోర్టుకు లాకొచ్చి తన భర్త నిర్దోషి అని దీప (వంటలక్క) నిరూపించిన, జైలు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత అందరూ ఊహించినట్టుగా టాపిక్ మోనిత కడుపులో బిడ్డ మీదకు వెళ్లింది. కోర్టులో 'మీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరు?' అని లాయర్ ప్రశ్నించగా 'కార్తీక్' అని మోనిత చెబుతుంది. 'మీకు పెళ్లి కాకుండా ఆ బిడ్డ ఎలా వచ్చాడు?' అని లాయర్ అడగటంతో 'కృతిమ గర్భం దాల్చాను' అని చెబుతుంది. ఆ విషయం కార్తీక్‌కి తెలియదని, పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ రోజున చెప్పాలని ఆగానని అంటుంది.

కార్తీక్‌కి దీపతో పెళ్లి కాకముందే అతడిని తాను ప్రేమించానని, ఆమెతో పెళ్లైన తర్వాత కూడా తన ఇంటికి వచ్చి ప్రతిదీ తనతో చెప్పుకోవడం వల్ల ఈ సమాజం తనపై నిందలు వేసిందని, దాంతో తాను ఇల్లు మారాల్సి వచ్చిందని మోనిత చెబుతుంది. కార్తీక్ తనవాడు అనిపించుకోవడం కోసం మోనిత చేసిన కుట్ర తప్ప, అందులో ప్రేమ ఎక్కడుందని దీప అంటుంది. మోనిత తనకు స్నేహితురాలు అని, భార్యతో విడిపోయిన సందర్భంగా మమ్మల్ని కలపడానికి అమ్మ ప్రయత్నాలు చేస్తుంటే... వాటిని ఆపడానికి మోనితను పెళ్లి చేసుకుంటానని అన్నాను తప్ప... మోనితను ఏనాడూ వేరే ఉద్దేశంతో, ఆలోచనతో చూడలేదని కార్తీక్ చెబుతాడు. పెళ్ళికి అంగీకరించకపోతే తన తమ్ముడికి యాక్సిడెంట్ చేయించిందని, కృత్రిమ గర్భం దాల్చిందని మోనిత నేరాలు బయటపెడతాడు.

ఆ సమయంలో 'మోనిత కడుపులో బిడ్డకు నేను తండ్రిని కాదు' అని కార్తీక్ అరుస్తుంటే... దీపకు గతం గుర్తుకు వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో సీన్ వస్తుంది. మరోవైపు మోనిత "పదకొండేళ్ల క్రితం కట్టుకున్న భార్య కడుపులో బిడ్డకు తాను తండ్రి కాదని కార్తీక్ అన్నాడు. ఇప్పుడు నా కడుపులో బిడ్డకు తండ్రి కాదంటున్నాడు. అప్పుడు కాదనుకున్న భార్య ఇప్పుడు అతడి పక్కన ఉంది. ఏమో రేపు నన్ను కూడా ఆదరిస్తాడేమో. ఇంకా నాలో ఆశ చావలేదు. నా కడుపులో బిడ్డకు తండ్రి కార్తీక్" అని అంటుంది. ఇదంతా పక్కన పెడితే... కార్తీక్ వాదన కోర్టు నమ్ముతుంది.

మోనితకు ఐదు లక్షల జరిమానాతో పాటు ఏడాదిన్నర కఠిన కారాగార శిక్ష విదిస్తుంది కోర్టు. హిమ హత్య విషయంలో విచారణ చేయమని ఆదేశిస్తుంది. మోనితను జైలుకు తీసుకువెళుతున్న సమయంలో మీడియా చుట్టుముడుతుంది. 'జైల్లో బిడ్డను కంటారా?' అని ప్రశ్నిస్తుంది. వికట హాసంతో 'సినిమాకు ఉన్నట్టే జీవితానికి మూడు భాగాలు ఉంటాయి. ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్. ఇది నా జీవితానికి క్లైమాక్స్ కాదు. ఇంటర్వెల్ మాత్రమే' అని మోనిత అంటుంది. 'క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది?' అని విలేకరి అడిగితే... 'ఎవరూ ఊహించి ఉండరు. చూస్తుండండి. అందరికీ తెలుస్తుంది' అని ఆన్సర్ ఇస్తుంది. ఆ తర్వాత దీపతో మాట్లాడాడతానని ఏసీపీ రోషిణిని అడిగితే ఆమె ఒప్పుకోదు. 

"దీపక్కా! దీపక్కా... శ్రావ్య నీకు తోడబుట్టిన చెల్లెలు అయితే, కార్తీక్ మూలంగా నేనూ చెల్లెల్నే అవుతా! గుర్తుపెట్టుకో!!" అని మోనిత గట్టిగా అరుస్తుంది. కోపంగా దీప ముందుకు కదిలితే... సౌందర్య ఆపుతుంది. "దాన్ని నువ్వు కొడితే ఫొటోలు వైరలవుతాయి. అవసరమా? బురదలో రాయి వేయడం!" అని అంటుంది. అత్త మాటలకు దీప శాంతిస్తుంది. కానీ, మోనిత మాత్రం ఆగలేదు. 

"ఆంటీ... సౌందర్య ఆంటీ! నా బిడ్డకు నామకరణం, బారసాల, అక్షరాభ్యాసం... అన్నీ మీ చేతుల మీదే జరగాలి. లేకపోతే నేను ఊరుకోను" అని మోనిత మళ్ళీ అరుస్తుంది. ఈసారి సౌందర్య కోపంగా కదిలితే దీప ఆపుతుంది. "నన్ను ఆపి మీరు ఉరుకుతారేంటి?" అని అడుగుతుంది. "దాని నమ్మకం చూశావా?" అంటుంది సౌందర్య. 

అక్కడితోనూ మోనిత ఆగలేదు. ఈసారి కార్తీక్ తండ్రి ఆనందరావును పిలుస్తుంది. "ఆనందరావు అంకుల్! మీకు మనవడే పుడతాడు. మీకు అసలైన వారసుడొస్తాడు. వాడికి మీ పేరే పెడతా. 'ఆనందం' అని! మోనిత శకం ముగిసిపోలేదు. రీ-ఎంట్రీ ఇస్తా. గుర్తు పెట్టుకోండి... బిడ్డతో వస్తా! రీ-ఎంట్రీ పక్కా! ఐ లవ్యూ మై డియర్ ఫ్యామిలీ" అని మోనిత అరుస్తుంది. ఇదంతా కోపంగా కార్తీక్ చూస్తూ ఉంటాడు. తర్వాత ఏమైందనేది మిగతా ఎపిసోడ్స్ లో చూడాలి. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.