.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -742 లో....సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వస్తుంది. కానీ జ్యోత్స్న మొహం సూరజ్ చూడడు.. రేయ్ నేను ఇటువైపు ఉంటే నువ్వు అటువైపు తిరిగి మాట్లాడుతున్నావని అడుగుతుంది. అది నా ఇష్టమని సూరజ్ చెప్తాడు. నేను చెప్పినట్టు చేస్తానన్నావ్ .. మళ్ళీ ఆఫీస్ కి ఎందుకు వచ్చావని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు అవుట్ హౌస్ లో కన్పించొద్దన్నావ్ ఆఫీస్ లో కాదని సూరజ్ అంటాడు. నేను ఇప్పుడు దీప గారి అడ్వైజర్ ని.. అందుకే వచ్చానని సూరజ్ చెప్తాడు.
నువ్వు ఇక్కడికి కూడా రావడం నాకు ఇష్టం లేదని జ్యోత్స్న అనగానే అది నీ ప్రాబ్లమ్ నాది కాదని సూరజ్ అంటాడు. అప్పుడే సర్ మిమ్మల్ని పిలుస్తున్నారని ఫ్యూన్ వచ్చి సూరజ్ కి చెప్తాడు. శివన్నారాయణ క్యాబిన్ కి సూరజ్ వెళ్తాడు. ఎందుకు బయటకు వచ్చేసావని అడుగుతాడు. నాకు నచ్చలేదని సూరజ్ చెప్తాడు. నాకు నచ్చని చోట నేను అసలు ఉండను సర్.. ఇప్పుడు కూడా కొంచెం వర్క్ ఉందని ఆఫీస్ కి వచ్చాను.. అది అయిపోతే వెళ్ళిపోతానని సూరజ్ చెప్తాడు. ఇంటికిరా నీతో మాట్లాడాలని శివన్నారాయణ అంటాడు. రానని సూరజ్ చెప్తాడు. నా కోసం ఒక్కసారి రమ్మని శివన్నారాయణ చెప్తాడు. మరొకవైపు సూరజ్ వెళ్తుంటే జ్యోత్స్న స్కూటీ మీద వచ్చి లిఫ్ట్ ఇస్తానని అంటుంది. వద్దని సూరజ్ అంటాడు. నీ ప్రాబ్లమ్ ఏంట్రా అసలు మొహం చూసి మాట్లాడడం లేదని జ్యోత్స్న అంటుంది. సూరజ్ మాత్రం రాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే కార్తీక్, దీప వచ్చి ఎవరినో తిడుతున్నావని అడుగుతారు.
వాడేంటి మొహం చూసి మాట్లాడడం లేదని జ్యోత్స్న అంటుంది. ఓహ్ తను నిన్ను చూడడం లేదని ఫీల్ అవుతున్నావా అని కార్తీక్ అంటడు. ఆ తర్వాత జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. వాడితో నీకు పెళ్లి అయితే ఆస్తులు సొంతం అవుతాయని పారిజాతం అంటుంది. దాంతో తనపై జ్యోత్స్న కోప్పడుతుంది. ఆ తర్వాత సూరజ్ రాక కోసం అందరు వెయిట్ చేస్తారు. వీలునామా తీసుకొని కార్తీక్ వస్తాడు. ఇప్పుడు వీలునామా ఎందుకని శివన్నారాయణ అడుగుతాడు. నేనే మార్పు చేసి తీసుకొని రమ్మన్నానని దశరథ్ అంటాడు. వీలునామాలో సూరజ్ తో పెళ్లి అయ్యిన మరుక్షణం ఆస్తులన్ని జ్యోత్స్న సొంతమని ఉంటుంది. అది విని జ్యోత్స్న కోప్పడుతుంది. అది చెయ్యమంది నేనే అని సుమిత్ర చెప్తుంది. జ్యోత్స్న కోపంగా వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
SEO Keywords:






