Home

»

Tv News

Brahmamudi : రేఖకు రాజు వార్నింగ్.. వెంకీ నిర్ణయంతో నందు కన్నీళ్లు!

Aug 7, 2026 10:03AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-1104 లో.. వెంకీ వెళ్తుంటే నందు వస్తుంది. ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదని అడుగుతుంది. నేను బిజీ ఉన్నా నాకు వర్క్ ఉందని చెప్పి వెంకీ వెళ్ళబోతుంటే నేను వస్తాను పదా అని నందు బైక్ ఎక్కుతుంది. మరొకవైపు రేఖ దగ్గరికి లక్కీ వచ్చి.. మేడం మీ పలుకుబడీ ఉపయోగించి కొంచెం మా అమ్మ ఎక్కడుందో కనిపెట్టండి అని అడుగుతాడు. అప్పుడే రాజు వచ్చి కచ్చితంగా కనిపెడుతుంది కానీ నువ్వు లోపలికి వెళ్ళు అనీ లక్కీని రాజు లోపలికి పంపిస్తాడు.

ఏంటి పిన్ని ఇంకా మీ అంతంట మీరు నిజం ఒప్పుకోవడం లేదు.. ఇంక టైమ్ లేదు నేనే ఈ విషయం టైమ్ చూసి అందరికి చెప్పేస్తానని రేఖని రాజు బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ తర్వాత ఇందు, అపర్ణ , సుభాష్ కలిసి రాజుని ఆటపట్టిస్తారు. కావాలనే రాజు రావడం చూసి యాక్టింగ్ మొదలెడతారు. లేదు నానమ్మ అవన్నీ ఇప్పుడు వద్దని ఇందు అంటుంది. అప్పుడే రాజు వచ్చి ఏంటని అడుగుతాడు. ఏం జరిగిందో చెప్పండి నేను చూసుకుంటానని రాజు అనగానే ముందే ఫిక్స్ అవ్వకు అని ఇందు అంటుంది. ఏం లేదు బాబు మీకు పెళ్లి అయింది కదా అప్పటి నుంచి ఇప్పటివరకు ఇందు తాళితో ఉంటుంది. నల్లపూసలు కుచ్చలేదు అందుకే నల్లపూసల కుచ్చాలంటున్నానని అపర్ణ అనగానే ఇప్పుడు ఎందుకు అమ్మమ్మ అని రాజు అంటాడు. ఇందాక చేస్తాను అన్నావని అపర్ణ అడుగుతుంది.

సరే చూద్దాంలే అన్నట్లు రాజు మాట్లాడతాడు. మరొకవైపు వెంకీ, నందు కాఫీ షాప్ కి వెళ్తారు. అక్కడ నందు బాధపడేలా ఇష్టం లేకున్నా వెంకీ మాట్లాడతాడు. నువ్వు గొప్పింటి కూతురివి నేను అలా కాదు.. ఇలా నీతో తిరిగి టైమ్ పాస్ చేస్తే మా ఇల్లు ఎలా గడుస్తుంది.. ఇంకొకసారి నాకు ఫోన్ చెయ్యకని వెంకీ చెప్పి వెళ్ళిపోతాడు. మరొకవైపు  ఐశ్వర్య నా దగ్గర అప్పు తీసుకుందని ఒకతను ఇంటికి వస్తాడు. ఏంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చావని అతనిపై ఐశ్వర్య కోప్పడుతుంది. తరువాయి భాగంలో లక్కీ తల్లి ఎవరో గానీ అలా వదిలేసింది.. నా ముందుకి వస్తే చెప్పుతో కొట్టేదాన్ని.. అలాంటప్పుడు ఎందుకు కన్నదని భ్రమరాంబ అనగానే ఆపండి అని రేఖ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

SEO Keywords:

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com