Home

»

Tv News

Karthika Deepam2 : చీర కట్టిన తుపాకీలా మారిన మాలిని.. సొంత కుటుంబానికే వెన్నుపోటు పొడవనున్న జ్యోత్స్న!

Jul 15, 2026 11:38AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -722 లో.... శివన్నారాయణకి దక్షిణామూర్తి కాల్ చేసి.. నాతో పోటీకి దిగితే ఓడిపోతావని భయమా అని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. దాంతో పోటీలో గెలిచి మెట్టింటి పౌరుషం ఏంటో తెలియజేయ్యాలి మావయ్య అని సుమిత్ర అంటుంది. దాంతో రేయ్ కార్తీక్ వాళ్ళకి ఫోన్ చేసి పోటీకి సిద్ధమని చెప్పు అని శివన్నారాయణ అంటాడు. దీప నువ్వు సీఈఓ కాబట్టి ఈ బాధ్యత నువ్వే తీసుకోవాలని శివన్నారాయణ చెప్పగానే  కార్తీక్, సూరజ్ వంక చూసి వాళ్ళు ఒకే అని చెప్పమని అనగానే దీప సరే అంటుంది.

నేను పోటీలో ఓడిపోతే చచ్చినట్లే అని శివన్నారాయణ అంటాడు. దీప ఖచ్చితంగా మనం గెలవాలని సుమిత్ర చెప్తుంది. మరొకవైపు సుమిత్ర గురించి దక్షిణామూర్తి బాధపడతాడు. మీరు ఏం టెన్షన్ పడకండి మావయ్య సుమిత్ర మన దగ్గరికి వస్తుందని మాలిని ధైర్యం చెప్తుంది. దక్షిణామూర్తి వెళ్ళాక మంచి అవకాశం కోసం ఎదురు చూసాను మావయ్య.. ఇప్పుడు దొరికింది శివన్నారాయణ కుటుంబం పునాధులతో సహా కూల్చేస్తానని మాలిని అనుకుంటుంది. ఆ తర్వాత దీప, కార్తీక్ ఇంటికి వస్తారు. శ్రీధర్ వచ్చాడని అనుకుంటారు కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది రాలేకపోతున్నానని వీడియో మెసేజ్ చేస్తాడు. దాంతో అందరు డిస్సపాయింట్ అవుతారు. ఆ తర్వాత అనసూయని చూసి ఎప్పుడు వచ్చారు అత్తయ్య అని  దీప హగ్ చేసుకుంటుంది. అందరు సరదాగా మాట్లాడుకుంటారు.

మరొకవైపు అందరు ఎంత కోపంగా ఉన్నారు గ్రానీ అని పారు తో జ్యోత్స్న అంటుంది. ఆ మాలిని అంటే ఏం అనుకున్నావే చీర కట్టిన తుపాకి అని పారిజాతం అంటుంది. ఇప్పుడు మనం ఓడిపోతే దీపని తిడతారు. ఇప్పుడు అదే చెయ్యాలి.. ఏం చెయ్యాలో తెలుసు కదా అని జ్యోత్స్న అనగానే తెలుసని పారు అంటుంది. మరొకవైపు రేపు అక్క వెళ్ళిపోతుంది అంట అని కాంచన అనగానే ఎక్కడికి లేదు ఇక్కడే ఉంటుందని దీప అంటుంది. అప్పుడే శౌర్య వచ్చి నానమ్మ నువ్వు మాతోనే ఉండాలని అనగానే అనసూయ ఎమోషనల్ అవుతుంది. ఉంటానులే అని అనసూయ అనగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com