Home

»

Tv News

Karthika Deepam2: కార్తీక దీపం 2 లో హై ఓల్టేజ్ డ్రామా.. సుమిత్ర ఆపరేషన్ వేళ ఊహించని ట్విస్ట్!

Mar 19, 2026

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ ప్రస్తుతం అత్యంత ఉత్కంఠభరితమైన మలుపులో ఉంది. తాజాగా ప్రసారమైన మంగళవారం నాటి ఎపిసోడ్-621 లో.. సుమిత్ర ప్రాణాలను కాపాడటం కోసం దీప చేస్తున్న పోరాటం, మరోవైపు జ్యోత్స్న పన్నుతున్న కుట్రల మధ్య కథ రసవత్తరంగా సాగుతోంది. జ్యోత్స్న తన తండ్రి ఎవరో తెలుసుకునే క్రమంలో దాస్‌ను నిలదీస్తుంది కానీ అతను నిజం చెప్పడు. దాంతో నువ్వు ఊహించుకున్నదానికంటే భయంకరంగా ఉంటాయి నా చేష్టలు కానీ నువ్వు నన్ను ఏం చేయలేవని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత తను వెళ్ళిపోతుంది.

జ్యోత్స్న తన నిజమైన తండ్రి దాస్ అని నిరూపించాలని ప్రయత్నిస్తుండగా, అతను మాత్రం సుమిత్ర ఆపరేషన్ పూర్తయ్యేవరకు మౌనంగా ఉండాలని అనుకుంటాడు. అయితే జ్యోత్స్న మాత్రం వెనక్కి తగ్గకుండా, తను అనుకున్నది చేసి తీరుతానని సవాల్ విసిరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తల్లీకూతుళ్ల మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరోవైపు, హాస్పిటల్ లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. దీప కూతురు శౌర్య కనిపించడం లేదన్న వార్త కార్తీక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. శ్రీధర్ ఫోన్ చేసి శౌర్య మిస్సింగ్ అని చెప్పడంతో కార్తీక్ ఆందోళనగా బయటకు వస్తాడు. కార్తీక్ ప్రవర్తన చూసి దీపకి డౌట్ వస్తుంది.

సరిగ్గా అదే సమయంలో సుమిత్ర కుటుంబం హాస్పిటల్ కి చేరుకోవడంతో అక్కడ చిన్నపాటి గొడవ జరుగుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న ప్లాన్ ప్రకారం దీప దగ్గరకు పారిజాతం వెళ్లి శౌర్య కనిపించడం లేదని చెప్తుంది. దాంతో దీప టెన్షన్ పడుతుంది. కూతురు కోసం దీప బయటకు వెళ్లాలని చూస్తున్న సమయంలో డాక్టర్ వచ్చి సుమిత్ర ఆపరేషన్ గురించి ప్రస్తావిస్తుంది. నువ్వు ఇక్కడే ఉండాలని డాక్టర్ చెప్పగానే.. అప్పుడే పారిజాతం ఎంట్రీ ఇస్తుంది. దీప ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముందని పారిజాతం అనుమానంగా అడగడంతో కథలో అసలు ట్విస్ట్ మొదలైంది.

సుమిత్రకు ప్రాణదానం చేసేది దీప అని తెలిస్తే పారిజాతం, జ్యోత్స్న ఊరుకుంటారా?  శౌర్యను కార్తీక్ వెతికి తీసుకురాగలడా? అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా దీప తన ప్రాణాలను పణంగా పెట్టి సుమిత్రను కాపాడాలనుకోవడంపై అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. రాబోయే ఎపిసోడ్‌లలో దీప రహస్యం బయటపడుతుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. సుమిత్ర ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మీరు కూడా ఈ ఉత్కంఠభరితమైన మలుపులను చూడాలనుకుంటున్నారా? రాబోయే ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీ అంచనాను మాతో పంచుకోండి! 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com