ఆట డాన్స్ షో ప్రతీ వారం ఆడియన్స్ ని అలరిస్తోంది. ఇక ఈ వారం ఈ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో అడివి శేష్ కనిపించాడు. ఆయన మూవీస్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "మీ లైఫ్ లో ఫీల్ మై లవ్ ఏంటి " అని హోస్ట్ సుధీర్ అడివి శేష్ ని అడిగాడు. "నాకు సినిమాలతో ఎప్పుడో పెళ్లయిపోయింది. సినిమాలు చేయడం నా ప్యాషన్ . సినిమా నా భార్య." అని చెప్పాడు. దాంతో పక్కనే ఉన్న జడ్జ్ రాధికా ఒక రేంజ్ లో లుక్ ఇచ్చింది. "అంటే ఒక్కో ఫిలిం అంటే ఒక్కో వైఫ్ ఆ" అని అడిగేసింది. దాంతో అందరూ నవ్వేశారు. వెంటనే సుధీర్ "అలా ఐతే నేను గత 13 ఏళ్ళ నుంచి చేసుకుంటూనే ఉన్నాను. నాది వీక్లీ ఎపిసోడ్ కదా అంటే వీక్లీ ఒక పెళ్లి నాది " అన్నాడు. వెంటనే రాధికా కౌంటర్ ఇచ్చేసింది. "అంటే మల్టిపుల్ పార్ట్నర్స్ " అన్నమాట అనేసరికి సుధీర్ భయపడినట్టు నటిస్తూ బాబోయ్ వద్దు నాకా పెళ్లి వద్దు అన్నాడు. ఇక అడివి శేష్ మృణాల్ ఠాకూర్ తో కలిసి నటించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10 న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు క్షణం, గూఢచారి, మేజర్, హిట్ 2 వంటి మూవీస్ లో నటించాడు. 2010 లో కర్మ అనే మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి పంజా, ప్రభాస్ తో బాహుబలి, శర్వానంద్ తో కలిసి రన్ రాజా రన్ వంటి మూవీస్ తో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.




