Home

»

Tv News

Karthika Deepam2 : సూరజ్ క్యారెక్టర్‌ను సమర్థించిన జ్యోత్స్న.. దక్షిణమూర్తికి గట్టిగా వార్నింగ్!

Aug 16, 2026 9:03AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -750 లో...... ఆఫీస్‌లో కొత్తగా చేరిన గీతతో సూరజ్ చనువుగా ఉండటం చూసి జ్యోత్స్న అసూయతో రగిలిపోతుంది. గీత తనను కలవడానికి వస్తే సూరజ్ మెలికలు తిరగడం, ఆ తర్వాత ఇద్దరూ బయట బెంచ్‌పై మాట్లాడుకుంటూ కనిపించడం జ్యోత్స్నకు మరింత కోపాన్ని తెప్పిస్తుంది. గీత దగ్గరకు జ్యోత్స్న వెళ్తుంది‌. సూరజ్ జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తుంది. అయితే సూరజ్ తనకు కూడా ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేశాడని అయినా అతని నిజాయితీ చూశాక అతనిపై ఇష్టం మరింత పెరిగిందని గీత చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

ఇంతలో ఆఫీస్‌లో వర్షాల వల్ల తగ్గిన సేల్స్‌ని పెంచడంపై శివన్నారాయణ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఆ సమయంలోనే దక్షిణమూర్తి, మాలిని హడావిడిగా వచ్చి గొడవకు దిగుతారు. జ్యోత్స్న పెళ్లిని ఒక అనాథ అయిన సూరజ్‌తో చేయడానికి చూస్తున్నారంటూ శివన్నారాయణపై, కుటుంబ సభ్యులపై దక్షిణమూర్తి కోప్పడతాడు. దిక్కుమొక్కు లేనివాడికి ఇచ్చి మనవరాలి జీవితాన్ని నాశనం చేస్తున్నారంటూ అందరి ముందు నిలదీస్తాడు దక్షిణామూర్తి.

తాతను ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఊరుకోని జ్యోత్స్న ఈసారి అందరికి షాకిచ్చేలా గట్టి సమాధానమిస్తుంది. డబ్బు, ఆస్తుల కంటే సూరజ్ మంచి మనసు, క్యారెక్టర్ చాలా గొప్పవని జ్యోత్స్న స్పష్టం చేస్తుంది. తన మనసులో మరొకరు ఉన్నారనే కారణంతో సూరజ్ నిజాయితీగా ఈ పెళ్లికి నో చెప్పాడని, అలాంటి మంచి వ్యక్తిని తప్పు పట్టడానికి మీరు సరిపోరని జ్యోత్స్న అంటుంది. నా పెళ్లి విషయం గురించి మాట్లాడటానికి ఎవరికి అర్హత లేదని, ఒకవేళ పెళ్లి చేసుకుంటే మొదటి కార్డు మీకే ఇస్తానని జ్యోత్స్న కోప్పడుతుంది. జ్యోత్స్న మాటలకు సమాధానం చెప్పలేక దక్షిణమూర్తి, మాలిని అవమానంతో అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు. కుటుంబం కోసం, సూరజ్ మంచితనం కోసం జ్యోత్స్న నిలబడిన తీరును చూసి శివన్నారాయణ మెచ్చుకుంటాడు. జ్యోత్స్నలో వచ్చిన ఈ మార్పును గమనించిన దీప, కార్తీక్.. ఇకనైనా సూరజ్ మారుతాడా లేదా అని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Karthika Deepam 2, Star Maa, Jyothsna and Suraj, Telugu serial update, serial review

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com