Home

»

Tv News

Illu illalu pillalu : వల్లి వెన్నులో వణుకు పుట్టిస్తున్న నర్మద, వేదవతి ప్లాన్!

Aug 16, 2026 9:22AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -551 లో.. రేవతి మాటలతో ప్రేమ ఆలోచనలో పడుతుంది. మరోవైపు వల్లి కోపంతో రగిలిపోతూ తనను కొట్టిన ప్రేమపై పగ తీర్చుకోవడానికి ప్లాన్లు వేస్తుంది. అదే సమయంలో భద్రావతికి ఫోన్ చేసి, ప్రేమ మనసులో ధీరజ్ పట్ల ప్రేమ పెరుగుతోందని, ఆమె మళ్లీ అత్తారింటికి వెళ్లే ఆలోచనలో ఉందని సీక్రెట్ సమాచారం ఇస్తుంది. అదే దారిలో వెళ్తున్న నర్మద, వేదవతిలు వల్లి సీక్రెట్ ఫోన్ కాల్ గమనించి ఆగుతారు. వల్లి ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలని ఇద్దరూ ఆమె వెనుక నిలబడి గుసగుసలాడతారు. అనుమానం వచ్చిన వేదవతి, నర్మదలు వల్లిని మాటల్లో పెట్టి అసలు విషయం రాబట్టాలని అనుకుంటారు.

భద్రవతి పదే పదే ఫోన్ చేస్తుండటంతో కంగారుపడిన వల్లి, ఏదోలా మాట దాటవేసే ప్రయత్నం చేస్తుంది. అయితే నర్మద, వేదవతి పట్టుబట్టి ఫోన్ అడగడంతో, వల్లి తెలివిగా ఫోన్‌ను కింద పడేసి ముక్కలు చేస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నానో బయటపడకుండా ఇలా నాటకం ఆడి తప్పించుకోవాలని చూస్తుందని నర్మద అంటుంది. కానీ నర్మద ఊరుకోకుండా, కాల్ డేటా తీసి నువ్వు ఎవరితో మాట్లాడావో బయటపెడతామని వల్లికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అసలు విషయం బయటపడితే తన భరతం పడతారని వల్లి అనుకుంటుంది. ఇక తన ఆటలు సాగవని గ్రహించి తీవ్రమైన ఆందోళనలో పడుతుంది వల్లి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

Illu Illalu Pillalu serial, Star Maa serial updates, Illu Illalu Pillalu latest episode, Valli Bhadravati call, Telugu serial gossip.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com