.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -740 లో.....సూరజ్ ఒక అనాధ అని శివన్నారాయణ అంటాడు. ఇంట్లో నుంచి బయటకు గెంటెయ్యడానికి అనాధ అయితే ఏంటని జ్యోత్స్న అనగానే సూరజ్ ని జ్యోత్స్నకి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నామని సుమిత్ర అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ ఆలోచన ముందు దీపకి వచ్చిందని సుమిత్ర అనగానే ఏంటి దీప నిన్ను ఎప్పుడు అనాధ అంటున్నానని నువ్వు నన్ను ఒక అనాధకి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ప్లాన్ చేసావా అని జ్యోత్స్న అంటుంది.
నేను ఆ సూరజ్ ని పెళ్లి చేసుకోనని జ్యోత్స్న చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్, దీప బయటకు వస్తారు. వెనకాలే జ్యోత్స్న వస్తుంది. దీపపై జ్యోత్స్న కోప్పడుతుంది. నువ్వేం అన్నా సూరజ్ నీకు కరెక్ట్ జోడి అని దీప అంటుంది.ఆ మాటలు సుమిత్ర వింటుంది. నా మనసులో మాట దీప చెప్పిందని సుమిత్ర అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ , దీప ఇంటికి వెళ్లి జరిగింది చెప్తారు. సూరజ్ చాలా మంచోడు అని కాంచన వాళ్ళు అనుకుంటారు కానీ జ్యోత్స్నకి ఇష్టం లేదని దీప అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న కోపంగా సూరజ్ దగ్గరికి వెళ్లి తన చెంపచెల్లుమనిపిస్తుంది. ఏంట్రా నీకు నేను కావాలా.. ప్లాట్ ఫామ్ గాడివి అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా నువ్వు అంటే ఇష్టమని అని సూరజ్ అంటాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని జ్యోత్స్న అనగానే సరే అని సూరజ్ అంటాడు.
ఆ తర్వాత కార్తీక్, దీప, కాంచన శ్రీధర్ , సుమిత్ర అందరు కలిసి సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చెయ్యడానికి శివన్నారాయణ దశరథ్ ని ఒప్పించాలని అనుకుంటారు. ఇక అందరు శివన్నారాయణ ముందు కూర్చొని సూరజ్ అనాధ అయితే ఏంటి ఒక మంచి మనిషి.. ఇప్పుడు ఎంతమంది ఉన్నా భార్యాభర్త విడిగా ఉంటున్నారని సుమిత్ర అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

