
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1102 లో..... రాజు గుడికి వస్తాడు. తనని చూసి అపర్ణ ఎమోషనల్ అవుతుంటే నానమ్మ నువ్వు ఇప్పుడు బయటపడొద్దు ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి అని వాళ్ళని పంపిస్తుంది. రాజు రాగానే ఇందు కోపంగా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తుంది. అమ్మమ్మ వాళ్ళు ఎక్కడ ఇందు అని రాజు అడుగుతాడు. నువ్వు పూజకి రాకపోయేసరికి కోపంగా వెళ్ళారని రాజు చెప్తాడు.
ఇప్పుడు ఆ భ్రమరాంబ వాళ్ళు మన మీద డౌట్ తో ఇక్కడికి వస్తున్నారని రాజు చెప్తాడు. అయ్యో ఇప్పుడేం చేద్దామని ఇందు అడుగుతుంది. రాజు పంతులు దగ్గరికి వెళ్లి ఒక అబద్ధం చెప్పాలని అంటాడు. నేను చెప్పనని పంతులు అంటాడు. సరే ఇందాక పూజ ఎవరు చేశారని రాజు అడుగుతాడు అదిగో అక్కడ వున్నా వాళ్ళు అని పంతులు చెప్తాడు. వాళ్ళ దగ్గరికి ఇందు, రాజు వెళ్లి మాట్లాడుతారు. మరొకవైపు భ్రమరాంబ, శేషు ఇద్దరు పంతులు దగ్గరికి వెళ్లి ఇందాక ఇక్కడ పూజ చేసిన వాళ్ళు ఎవరని అడుగుతారు. పంతులు ఇందాక పూజ చేసిన వాళ్ళని చూపిస్తాడు. కానీ అక్కడ పూజ చేసిన వాళ్ళు పక్క కి వెళ్ళి అదే స్థానంలో రాజు, ఇందు ఉంటారు. వాళ్ళని చూసిన శేషు, భ్రమరాంబ వాళ్ళు నిజంగానే భార్యాభర్తలు మనమే తప్పుగా అర్థం చేసుకున్నామని అనుకుంటారు. మరొకవైపు ఐశ్వర్యకి శశి ఫోన్ చేసి బిజినెస్ పని మీద ఊరు వెళ్తున్నాను.. వచ్చాక నీకు పెద్ద సర్ ప్రైజ్ ఉందని అంటాడు. శశి చాలా రిచ్ కదా ఎలాగైనా పెళ్లి వరకు తీసుకొని వెళ్ళాలి. తను ఇంప్రెస్ అయ్యేలా ఒక రింగ్ ఇవ్వాలి.. డబ్బులు రేఖ ఆంటీని అడగాలని ఐశ్వర్య అనుకుంటుంది.
ఆ తర్వాత రేఖ దగ్గరికి భ్రమరాంబ, శేషు వచ్చి నిజంగానే రాజు, ఇందు భార్యాభర్తలు అని చెప్తారు. ఆ ఇందు మీద కోపంతో ఐశ్వర్య అన్ని అబద్దాలు చెప్తుందని రేఖ అంటుంది. అప్పుడే ఐశ్వర్య వచ్చి నాకు డబ్బులు కావాలని అడుగుతుంది. దాంతో రేఖ కోప్పడుతుంది. ఆ తర్వాత రాజు వస్తుంటే అపర్ణ, సుభాష్ హ్యాపీగా ఫీల్ అవుతారు. పూజకి రానందుకు కోపంగా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తారు. ఆ తర్వాత ఇందు అలిగితే తను మాట్లాడాలని సరదాగా ఆటపట్టిస్తాడు రాజు. తరువాయి భాగంలో లక్కీ తల్లి నువ్వే అన్న విషయం అందరికి చెప్పు లేదంటే నేనే చెప్తానని రేఖతో రాజు చెప్తాడు. ఆ తర్వాత నువ్వు పెళ్లి అయ్యాక నల్లపూసలు కుచ్చలేదు కదా.. ఇప్పుడు ఆ తంతు పూర్తి చెయ్ అని రాజుతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

