Home

»

Tv News

Karthika Deepam 2: జ్యోత్స్న రివెంజ్.. సుమిత్ర బర్త్‌డే వేడుకల్లో దీప సర్ప్రైజ్!

Jun 4, 2026 11:17AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (karthika Deepam 2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -687 లో... సూరజ్ రానని చెప్పాడు బావ అని కార్తీక్ తో దీప చెప్తుంది. రాకపోవడానికి అతని కారణాలు అతనికి ఉంటాయి అతని ఇష్టమని కార్తీక్ అంటాడు. అయినా ఒక హోప్ ఉంది.. ఒకవేళ నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాడేమోనని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత సూరజ్ పై రివెంజ్ తీర్చుకోవాలని జ్యోత్స్న అనుకొని కొంతమంది రౌడీలతో సూరజ్ ని కొట్టమని చెప్తుంది. ఆ తర్వాత సూరజ్ ఒంటరిగా వెళ్తుంటే రౌడీలు చుట్టుముట్టి తనని కొడుతు వీడియో తీసి జ్యోత్స్నకి పంపిస్తారు. ఆ వీడియో చూసి జ్యోత్స్న  నవ్వుతు పారిజాతానికి చూపిస్తుంది. ఒసేయ్ తప్పు చేస్తున్నావేమోనే అని పారిజాతం అనగానే నాతో పెట్టుకుంటే ఇదే పరిస్థితి వస్తుందని జ్యోత్స్న అంటుంది. 

ఆ తర్వాత దశరథ్ ఫోన్ లో కేక్ గురించి మాట్లాడుతాడు. ఆ మాటలు శౌర్య విని కేక్ ఎందుకు అంటుంది. ఈ రోజు మీ అమ్మమ్మ పుట్టినరోజు అని దశరథ్ చెప్పగానే ఇంట్లోకి వెళ్లి అందరికి చెప్తుంది. అయ్యో ముందు చెప్పలేదని దీప అంటుంది. జ్యోత్స్నకి కూడా తెలియదు కానీ తనకి ముందే తెలుసు అన్నట్లు యాక్టింగ్ చేస్తూ తనకి విషెస్ చెప్తుంది.

ఆ తర్వాత బావ నాకు ఎందుకు చెప్పలేదని కార్తీక్ ని జ్యోత్స్న అడుగుతుంది. ముందే చెప్తే ఏదైనా ప్లాన్ చేసేవాళ్ళమని దీప అంటుంది. నేను మా అమ్మకి ఎప్పుడు గుర్తుండే గిఫ్ట్ ఇవ్వాలని దీప ఆలోచిస్తుంది. బావ హెల్ప్ చెయ్యొచ్చు కదా ఐడియా ఇవ్వమని దీప అంటుంది. నేను ఇస్తానని శౌర్య అంటుంది. ఆ తర్వాత నీకు శౌర్యా ఎప్పుడు డ్రాయింగ్ వేసి గిఫ్ట్ ఇస్తుంది కదా.. అలాంటిదే నువ్వు ఒకటి డ్రాయింగ్ వెయ్ అని కార్తీక్ సలహా ఇస్తాడు. దాంతో దీప సరే అంటుంది. 

ఆ తర్వాత సుమిత్ర బర్త్ డే కి ఏర్పాట్లు చేస్తారు. కేక్ కటింగ్ కి ముందు దీప తను వేసిన డ్రాయింగ్ ఇస్తుంది. అది చూసి సుమిత్ర మురిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com