
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam2 ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-660 లో.... శ్రీధర్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దాంతో ఒకతను హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు. అతను గిఫ్ట్ షాప్ లో జ్యోత్స్న తో గొడవ పడ్డ వ్యక్తి.. అతను కార్తీక్ కి ఫోన్ చేసి విషయం చెప్పగానే కార్తీక్ హాస్పిటల్ కి వస్తాడు. శ్రీధర్ ని కలిసి మాట్లాడతాడు. నిన్ను సేవ్ చేసిన అతనికి థాంక్స్ చెప్పాలని కార్తీక్ బయటకు వస్తాడు. ఎదురుగా అతనే వస్తాడు. కార్తీక్ తనని పరిచయం చేసుకుంటాడు. అతను కూడా నా పేరు సూరజ్ అని చెప్తాడు. అప్పుడే సూరజ్ కి ఫోన్ వస్తుంది. ఏదో మీటింగ్ కి అటెండ్ అవ్వలేదు అని వాళ్ళకి సారీ చెప్తాడు.
మీరు మా నాన్నని సేవ్ చెయ్యడం వల్లే మీరు మీటింగ్ మిస్ అయ్యారని కార్తీక్ అంటాడు. జీవితం మళ్ళీ రాదు.. అవకాశం మళ్ళీ వస్తుందని సూరజ్ అనగానే చాలా రోజుల తర్వాత ఒక మనిషి తో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందని కార్తీక్ అంటాడు. ఇద్దరు కలిసి శ్రీధర్ దగ్గరికి వెళ్తారు. ట్యాబ్లెట్స్ కి డబ్బు ఎంత అని కార్తీక్ అడుగుతాడు. మీరు అడగకూడదు నేను చెప్పకూడదని సూరజ్ అంటాడు. మీ ఋణం ఎలా తీర్చుకోవాలని కార్తీక్ అనగానే టైమ్ వచ్చినప్పుడు అని సూరజ్ అంటాడు. రాకపోతే నేనే మీ ఋణం తీర్చుకున్నాను అని అనుకోండి అని సూరజ్ అంటాడు.
ఆ తర్వాత దీప ఇంటికి వెళ్తుంది. కార్తీక్ ఎక్కడ అని కాంచన అడుగుతుంది. ఏమో అని దీప అనగానే కార్తీక్ కి కాంచన ఫోన్ చేస్తుంది. కార్తీక్ లిఫ్ట్ చెయ్యకపోయేసరికి శ్రీధర్ కి ఫోన్ చేస్తుంది. శ్రీధర్ లిఫ్ట్ చేస్తాడు కానీ తనకి అలా జరిగినట్లు ఏం చెప్పడు.
ఆ తర్వాత శ్రీధర్ ని తీసుకొని కావేరి దగ్గరికి వెళ్తాడు కార్తీక్. విషయం తెలిసి స్వప్న ఏడుస్తుంది. నాన్నని ఇంకొకసారి టెన్షన్ పెట్టనని స్వప్న అంటుంది. ఇంకొకసారి ఇలా టెన్షన్ పెడితే నాన్న మనకి ఉండడు అని కార్తీక్ అంటాడు. పిన్ని నాన్నని జాగ్రత్తగా చూసుకోమని కార్తీక్ చెప్తాడు కార్తీక్. కాశీ నువ్వు ఇక్కడే ఉండమని కార్తీక్ అన్నాడు. మీ అమ్మకి చెప్తావా అని శ్రీధర్ అడుగగా చెప్తానని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






