
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1022 లో... రేఖకి ఇందుని అప్పగించాలని రాజు నిర్ణయం తీసుకుంటాడు. రేఖని పిలిచి ఇందుని అప్పగిస్తాడు. రేఖని చూసి ఇందు షాక్ అవుతుంది. ఇందుని రేఖ లాక్కొని వెళ్తుంటే.. రాజు వంక బాధగా చూస్తుంది ఇందు. రాజు కూడా తన వంక బాధగా చూస్తాడు.అప్పుడే లక్కీ డబ్బు పట్టుకొని వస్తాడు. ఏంట్రా ఆ అమ్మాయి వంక అలా చూస్తున్నావ్.. తనని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. అదేం లేదు ఆ అమ్మాయి నా వంక దీనంగా చూస్తుందిరా అని రాజు బాధపడుతాడు. ఆ తర్వాత నువ్వు ఈ డబ్బు సాహోకి ఇచ్చెయ్ నా ఫ్యామిలీ సేఫ్ అని రాజు అంటాడు. ఇది ఐశ్వర్యకి ఇచ్చేస్తాను అని రాజు అంటాడు.
మరొకవైపు ఇందుని లాక్కొని వెళ్లి రేఖ ఇంట్లో పడేస్తుంది. అది చూసి ఏంటి రేఖ ఏమైనా అయితే ఎలా.. అలా పడేసావని అపర్ణ కోప్పడుతుంది. నీ మనవరాలిని ప్రాణాలతో తీసుకొని వచ్చాను సంతోషించు అని రేఖ అంటుంది. మా రేఖ నీ గురించి తలవంచి అందరిని డబ్బు అడిగింది.. కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలియదా అని ఇందుపై భ్రమరాంబ కోప్పడుతుంది. రేపు ఆస్తి పేపర్స్ పై సంతకం చెయ్యాలని ఇందుకి రేఖ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఇన్ని రోజులు ఏమయ్యావ్.. అసలు ఎవరు కిడ్నాప్ చేశారు అని ఇందుని సుభాష్ అడుగుతాడు. డబ్బు కోసం వేరే వాళ్ళు కిడ్నాప్ చేశారని ఇందు చెప్తుంది.
మరొకవైపు రాజు హాస్పిటల్ కి వెళ్లి ఎవరినో బయట నుండి చూస్తూ ఉంటాడు. డాక్టర్ తో తన గురించి మాట్లాడతాడు. తను త్వరగా కోలుకోవాలని చెప్తాడు. మా ప్రయత్నం మేం చేస్తున్నామని డాక్టర్ చెప్తాడు. అప్పుడే రాజుని శృతి చూస్తుంది. తన దగ్గరికి వెళ్లేసరికి రాజు వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత రాజు ఇంటికి వెళ్తాడు. అసలు నువ్వు ఆ సాహోతో ఏం చేస్తున్నావ్ రా అని చలపతి అడుగుతాడు. బిజినెస్ అని రాజు చెప్తాడు. రాజు ఇంట్లో నుండి వెళ్లిపోతుంటే.. తనని ఫాలో అవుతు వచ్చిన శృతి, రాజుని ఆగమని అంటుంది. లోపల మా నాన్న ఉన్నాడు వెళ్ళండి అని రాజు అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
ఇందాక వెళ్ళింది ఎవరు అని శృతి లోపలకి వెళ్లి అడుగుతుంది. మా అబ్బాయి అని చలపతి అనగానే అబద్ధం చెప్తున్నారు.. అతను అచ్చం మా స్వరాజ్ సర్ లాగే ఉన్నారని శృతి అంటుంది. రాజు గురించి ఏదైనా తెలుస్తుందేమోనని చలపతి, లక్ష్మి అనుకొని.. వాడు మా అబ్బాయి కాదని జరిగింది మొత్తం చెప్తారు. అతను దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన వాడిలా ఉన్నాడని శృతి అనగానే వాళ్ళు షాక్ అవుతారు.
తరువాయి భాగంలో ఆస్తి పేపర్స్ పై ఇందు వేలిముద్ర వేస్తుంది. అది చెల్లదని అపర్ణ వాళ్లతో ఇందు చెప్తుంది. అదే విషయం రేఖ వాళ్లతో లాయర్ కూడా చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

