Home

»

Tv News

Karthika Deepam 2: కాంచన ఎమోషనల్.. అసలు నిజం కార్తీక్ బయటపెడతాడా?

Mar 15, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-618 లో.... కార్తీక్, దీప ఇద్దరూ బిడ్డని వద్దనుకుంటున్నారని కాంచనకి తెలిసి ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది. ఈ విషయం శివన్నారాయణకి తెలిసి కోప్పడుతాడు. 

ఈ విషయం మీ అన్నయ్యకి కుడా తెలుసు.. అందరు కలిసి ఈ విషయం దాచారని పారిజాతం అనగానే ఇంక కాంచన పట్టరాని కోపంతో ఊగిపోతుంది. ఇన్నిరోజులు నిన్ను నమ్మాను అన్నయ్య, ఇంత మోసం చేస్తావని ఊహించలేదని కాంచన ఎమోషనల్ అవుతుంది. నాకు ఎవరు కనిపించకుండా నన్ను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళండి అని కాంచన ఏడుస్తుంది. పాపం సుమిత్ర ఇవన్నీ వింటే చచ్చిపోయేదని శివన్నారాయణకి వినపడేలా కావాలనే పారిజాతం అంటుంది. 

ఆ తర్వాత దీప, కార్తీక్, దశరథ్ మాట్లాడుకుంటారు. అసలు ఇదంతా పారిజాతం పిన్ని ఎప్పుడు వింది అని మాట్లాడుకుంటారు. నిజం ఎప్పుడు తెలిసినా.. రియాక్షన్ ఇదే అని మనం ఉహించుకున్నాం కదా అని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వచ్చి వింటుంది. జ్యోత్స్న వచ్చి వింటుందని కార్తీక్ వాళ్ళు గమనించి సైలెంట్ అయిపోతారు‌. నేను వచ్చానని వాళ్లకి అర్థం అయినట్లు ఉంది.. నేను వెళ్లిపోవడం మంచిది అని జ్యోత్స్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

మరొకవైపు స్వప్న దగ్గరికి కాశీ వచ్చి మాట్లాడతాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తాడు. నాకు ఎక్కడ హ్యాపీ ఉందని చెప్తున్నావని స్వప్న వాదిస్తుంది. అయినా తన మాట లెక్క చేయకుండా మరొకసారి విషెస్ చెప్పి వెళ్ళిపోతాడు. 

ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. అసలు వాళ్ళు మన గురించి ఏం అనుకుంటాన్నారు. ఏం జరుగుతుందని కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com