Home

»

Tv News

Brahmamudi: పబ్ లో ఇందు.. రాకీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

Mar 15, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -980 లో... ఇందు పబ్ లో రాకీ దగ్గరికి వచ్చి జాబ్ గురించి మాట్లాడుతుంది. తన మాటలు ఎందుకో తనకి తేడాగా అనిపించినా జాబ్ తప్పనిసరి అని మౌనంగా ఉంటుంది. నేను జ్యూస్ తీసుకొని వస్తానని రాకీ అక్కడ నుండి వెళ్తాడు. 

మరొకవైపు భ్రమరాంబ, రేఖ దుగ్గిరాల ఆస్తుల గురించి మాట్లాడుకుంటారు. ఇంత ఆస్తి కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చెయ్యడంలో తప్పు లేదు కానీ, ఇప్పుడు ఇందు సంతకం పెడుతుందా అని భ్రమరాంబ అడుగుతుంది. పెట్టదు ఎందుకంటే అది సంతకం చెయ్యదు కదా వేలిముద్ర కదా అని రేఖ అంటుంది. 

మరొకవైపు మీ అమ్మ, ఆ రేఖ రోజు ఈ టైమ్ కల్లా పడుకునేవాళ్ళు అయినా ఇంకా పడుకోలేదు. అదే టెన్షన్ అవుతుందని స్వాతితో అపర్ణ అంటుంది. ఒసేయ్ ఇందు వాటర్ తీసుకొనిరా అని రేఖ పిలుస్తుంది. దాంతో అపర్ణ టెన్షన్ పడుతూ వాటర్ తీసుకొని వస్తుంది. 

నీ మనవరాలు ఎక్కడికి వెళ్ళింది. నువ్వు తీసుకొని వచ్చావని రేఖ అనగానే ఇందు పడుకుందని అపర్ణ అంటుంది. అది ఉంటే నిన్ను పని చెయ్యనివ్వదని రేఖ అంటుంది. అవును అసలు అది ఇంట్లోనే ఉందా అని భ్రమరాంబ అంటుంది. అవును వదిన దాన్ని నమ్మడానికి లేదు. నువ్వు వెళ్లి ఒకసారి చూసిరా అని రేఖ అంటుంది. 

దాంతో భ్రమరాంబ మెల్లగా వెళ్లి చూస్తుంది. లోపలికి వెళ్లేసరికి అక్కడ స్వాతి పడుకొని ఉంటుంది. తనని చూసి ఇందు అనుకొని భ్రమరాంబ బయటకి వచ్చి నిజంగానే ఇందు పడుకొని ఉందని రేఖతో చెప్తుంది. 

మరొకవైపు రాజు, ఐశ్వర్య పబ్ లో మాట్లాడుకుంటారు. రాజు మాటలకి ఐశ్వర్య ఇంప్రెస్ అవుతుంది. మీ నెంబర్ ఇవ్వొచ్చు కదా అని రాజు అనగానే ఐశ్వర్య ఇస్తుంది. 

తరువాయి భాగంలో ఇందు కోసమని రాకీ జ్యూస్ తీసుకొని వస్తాడు. అందులో ఏదో కలిపి తీసుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com