
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -677 లో......దీపకి మేనేజర్ ల్యాప్ టాప్ తీసుకొని వచ్చి.. మీరు మీ మెయిల్ ఐడీతో లాగిన్ అవ్వండి.. అప్పుడు రెస్టారెంట్ గురించి వస్తుందని చెప్పగానే దీపకి ఏం అర్థం కాదు. దాంతో జ్యోత్స్న నవ్వుకుంటుంది. మెయిల్ ఐడి గురించి అడిగితే తనకి ఏం తెలుస్తుంది.. వంటలు ఎలా చేయాలో చెప్పు చేస్తుంది.. రూమ్ ఎలా క్లీన్ చెయ్యాలో అడుగు చెప్తుందని జ్యోత్స్న అంటుంది. అదంతా ఎంప్లాయిస్ చూస్తారు. కార్తీక్ ఫోన్ లో దీపకి మెయిల్ ఐడి పంపిస్తాడు. కావాలనే అక్కడున్న అటెండర్ ని పిలిచి ఇప్పుడు మెయిల్ ఐడి ఎలా ఉంటుంది ఏంటని అతనికి చెప్తాడు. అదంతా దీప అర్థం చేసుకొని ఫోన్ లో చూస్తుంది.
మేనేజర్ గారు నాకు మెయిల్ ఐడి ఉంది ఓపెన్ చేయండి అని దీప చెప్తుంది. ఎవరికైనా తెలియకపోతే చెప్పాలి కదా ఇలా చెయ్యకూడదని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి కార్తీక్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వర్క్ చేసుకుంటున్న దీప దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. ఈ సారి అంటే తప్పించుకున్నావ్.. ఇక మీదట ఇలాంటివి చాలా ఎదరుకోవాల్సి ఉంటుందని జ్యోత్స్న అంటుంది. నిన్ను నీ తల్లికి దూరం చేస్తానని జ్యోత్స్న అంటుంది. మరొకవైపు కాశీకి స్వప్న కాఫీ తీసుకొని వస్తుంది .ఇద్దరు చాలారోజుల తర్వాత ప్రేమగా మాట్లాడుకుంటారు.
మరొకవైపు జ్యోత్స్న, దీప, కార్తీక్ ఇంటికి వస్తారు. ఇంటికి వెళ్లి తనకి ఏం తెలియదు అనవసరంగా పెద్ద బాధ్యతలు అప్పగించారని దీపని తక్కువ చేసి మాట్లాడుతుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్ తనకి క్లాస్ తీసుకుంటాడు. నువ్వు నీ సొంతంగా ఎదుగు కానీ వేరొకరిని తొక్కి నువ్వు ఎదుగకు.. నువ్వు నా బలహీనత అయినంత మాత్రానా.. ఏం చేసిన ఒప్పుకోనని జ్యోత్స్నకి సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నమ్మకం పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తారు దీప అని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






