Home

»

Tv News

Illu illalu pillalu: ఆస్తి కోసం కన్నతండ్రినే కోర్టుకు లాగుతావా? సాగర్‌పై వేదవతి ఫైర్!

May 23, 2026 12:07PM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -478 లో.. ఆస్తులు పంచి ఇవ్వనని రామరాజు అనగానే ఎలా ఇవ్వరు న్యాయంగా అయితే తండ్రి ఆస్తులు మొత్తం కొడుకులకే వస్తుందని ప్రసాదరావు అంటాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి నేను అయితే ఆస్తులు పంచనని రామరాజు అంటాడు. ఆయన అలా చెప్తే వినడు.. కోర్ట్ నుంచి నోటీసులు పంపిద్దామని సాగర్ అంటాడు. ఏం అంటున్నావ్ రా కన్నతండ్రిని కోర్ట్ కి లాగుతావా అని వేదవతి కోప్పడుతుంది. ఆస్తులన్నీ  మీకే కానీ పెళ్లి కావలసిన కూతురు ఉంది.. దాన్ని ఎవరు పట్టించుకుంటారా అని వేదవతి అంటుంది.

నా కూతురికి పెళ్లి అయ్యేవరకు ఆస్తులు ముక్కలు కావు.. ఈ విషయం గురించి ఇంకొకసారి తీసుకొని రావొద్దని వేదవతి వార్నింగ్ ఇస్తుంది. అల్లుడు ఈ ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆస్తి నీకు రాదు. నువ్వు ఇక్కడే ఉండాలని ప్రసాదరావు అంటాడు. ఈయన అవమానిస్తుంటే ఎలా ఉండాలి మావయ్య అని సాగర్ అంటాడు. అప్పుడే వల్లికి సుకన్య సైగ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మావయ్య పరువుపోతుంది.. అదే ఈ ఇంట్లోనే వేరే కాపురం ఉండండి అని వల్లి సలహా ఇస్తుంది. బుద్ధి ఉందా నీకు అని వల్లిపై వేదవతి కోప్పడుతుంది. ఇప్పుడు వాళ్ళు బయటకు వెళ్తే అందరికి తెలుస్తుంది. పరువుపోతుంది అందుకే ఇలా చెప్పాను మావయ్య ఏమంటారని వల్లి అనగానే మీకు నచ్చినట్లు కానివ్వండి అని రామరాజు అంటాడు. మావయ్య ఒకే అన్నాడు. సుకన్య నువ్వు వెళ్లి ఏదైనా తీసుకొనిరా మధ్యలో గీత గీద్దామని అంటుంది. దాంతో సుకన్య, వల్లి కలిసి ఇంట్లో మధ్య లో ఒక పెద్ద గీత గీస్తారు. ఇంట్లో వాళ్లంతా ఒకవైపు సాగర్, నర్మద ఒకవైపు ఉంటారు.

మరొకవైపు భద్రవతి వాళ్ళు క్రాకర్ కాలుస్తూ సెలెబ్రేషన్స్ చేసుకుంటారు. రామరాజు వాళ్ళు బయటకు వస్తారు. మనం అనుకున్నది ఇప్పుడు జరిగింది.. వాడి కుటుంబం ముక్కలు అయిందని భద్రవతి అంటుంది. నువ్వు ఏమైనా మనిషివేనా అని వేదవతి కోప్పడుతుంది. ప్రేమ కూడా వాళ్లపై కోప్పడుతుంది. ఆ తర్వాత భాగ్యం, సుకన్య వల్లి ఆనందరావు గదిలోకి వెళ్లి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com