Home

»

Tv News

Jayam serial: గంగ ప్రాణాలకే ప్రమాదం.. గుడిలోనే బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసిన వీరు, ఇషిక!

Jul 21, 2026 10:05AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-325 లో గుడిలో మహామృత్యుంజయ హోమం జరిపించాలని గంగ చెప్పడంతో శకుంతల, పెద్దసారు అంతా కలిసి ఏర్పాట్లు చేస్తారు. అయితే వీరు, ఇషిక మాత్రం గంగని లేపెయ్యడానికి స్కెచ్ వేస్తారు. గుడిలో ఓవైపు రుద్ర, రంగా, శకుంతల, పెద్దసారు ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు ఇషిక, వీరు రౌడీల గురించి మాట్లాడుకుంటారు. ఇక రౌడీలకి ఫోన్ చేసి గంగ రూమ్ అడ్రెస్ చెప్పి చంపేయమని వీరు చెప్తాడు. 

మరోవైపు ఇషిక, వీరు మాట్లాడుతుంటే అప్పుడే పెద్దసారు వచ్చి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారని అంటాడు. దాంతో ఇషిక, వీరు కంగారుపడతారు. అదే సమయంలో రంగా అక్కడికి వచ్చి రుద్ర బావని చంపాలని ప్లాన్ చేస్తున్నావా అని వీరుని అంటాడు. దాంతో రంగా అని గట్టిగా కోపంగా అరుస్తాడు వీరు. అక్కడే ఉన్న పెద్దసారు అదేం ఉండదులే అని అంటాడు. ఇక వీరు కవర్ చేస్తాడు. ఇక గంగ రెడీ అవుతున్న రూమ్ దగ్గరికి రౌడీ కత్తితో వెళ్తాడు. అక్కడ గది బయట ఉండి రూమ్ డోర్ కొడుతుంటాడు. కానీ గంగ ఓపెన్ చేయదు. అదే సమయంలో పక్క గదిలో ఉన్న రుద్ర రెడీ అయి బయటకు వస్తాడు. రుద్రని చూసిన రౌడీ కత్తిని తన వెనుకాల పాకెట్ లో దాచేస్తాడు. ఏ ఎవర్రా నువ్వు అని రుద్ర అనగానే ఆ రౌడీ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. ఇక రుద్రకి బయపటి ఆ రౌడీ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక గంగ రూమ్ దగ్గరికి రుద్ర వచ్చి డోర్ కొడతాడు. రెడీ అవుతున్నాను సర్ అయిదు నిమిషాలు అని గంగ అంటుంది. అప్పుడే రంగా వస్తాడు. 

మరోవైపు పెద్దసారు కోసం పూజారి  వెతుకుతూ ఉంటాడు. అతడికి రుద్ర ఎదురుపడి ఏంటండి అని అడుగుతాడు. మీ భార్య గంగకి అడుగడుగునా కష్టాలే అని అంటాడు. మీ సంకల్ప బలానికి మీ భార్య మనో బలం తోడైతే మీకు మంచిదే కానీ తనకి ముందుముందు చాలా అవరోధాలు రానున్నాయని అతను చెప్తాడు. దాంతో రుద్ర కంగారుపడతాడు. గంగ మహారాణిలా బ్రతకాల్సిందని కానీ తను తలరాత అలా మారిపోయిందని పూజారి చెప్పడంతో తనకి నేను తోడుగా ఉంటానని రుద్ర అంటాడు. ఇక గంగ దగ్గరికి రుద్ర వస్తాడు. అప్పుడే రంగా వచ్చి.. ఏంటి బావ అని అడుగుతాడు. మీ చెల్లి బయటకు రావడం లేదని అంటాడు. రెడీ అవుతున్నానని గంగ చెప్తుంది. ఇక కాసేపటికి గంగ అందంగా ముస్తాబు అయి వస్తాడు. ఇక రంగ, గంగ, రుద్ర హోమం జరిగే దగ్గరికి వస్తారు. మరోవైపు రౌడీలతో కలిసి బాంబ్ తెప్పిస్తాడు వీరు. ఇక యాగంలో వేసే కొన్ని మూటలలో బాంబ్ ని పెడతాడు ఓ రౌడీ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com