Home

»

Tv News

Podharillu : మహాతో రిజిస్టర్ మ్యారేజ్ సీక్రెట్ లీక్.. చక్రికి ఊహించని షాక్!

Jul 21, 2026 10:09AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -161 లో.... మహాని విక్కీ డ్రాప్ చేస్తానని అంటాడు. దాంతో మహా అతని కార్ ఎక్కుతుంది. మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారని విక్కీ అడుగుతాడు. భూమ్మీద ఉంటారని మహా తిక్కగా సమాధానం చెప్తుంది. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు వాళ్ళకి నచ్చింది చేస్తుంటే నాకు నచ్చింది చెయ్యాలని ఇక్కడికి,  వాళ్ళకి దూరంగా వచ్చానని మహా చెప్తుంది. మహాకి తన ఫ్రెండ్ కాల్ చేస్తుంది. విషెస్ చెప్తుంది.

అదంతా విక్కీ విని ఈ రోజు నీ బర్త్ డే నా.. నాకెందుకు చెప్పలేదు.. చెప్తే ఆఫీస్ లో కేక్ కట్ చేసేవాళ్ళం కదా అని విక్కీ అంటాడు. అవన్నీ వద్దనే చెప్పలేదని మహా అంటుంది. ఆ తర్వాత విక్కీ ఒక దగ్గర కార్ ఆపి తనకి ఒక గిఫ్ట్ తీసుకొని వస్తాడు. అది చూసిన మహా.. ఎందుకు ఇవన్నీ అని అంటుంది. మహాని విక్కీ పోలీస్ స్టేషన్ ముందు డ్రాప్ చేస్తాడు. నా పని అయ్యాక పిక్ చేసుకుంటానని చెప్పి విక్కీ వెళ్తాడు. ఆ తర్వాత ధర్మేంద్ర దగ్గరికి మహా వస్తుంది. మీరు నాకు విడాకులు ఎందుకు తీసుకుంటున్నారని కాల్ చేస్తున్నారు కదా నేను విడాకులు తీసుకుంటున్నట్లు మీకు ఎలా తెలుసని మహా అడుగుతుంది అప్పుడే ఇన్‌స్పెక్టర్ వస్తాడు. నువ్వు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్  అవుతున్నావని ఇన్‌స్పెక్టర్ అడుగుతాడు. తన హస్బెండ్ ఫోన్ చేసి చెప్తే అలా ఫోన్ చేసి విడాకులు వద్దని చెప్పాను. అతనికి నువ్వు అంటే చాలా ఇష్టం అమ్మ అని ధర్మేంద్ర చెప్తాడు. ఐడి ప్రూవ్ లేకుండా మా పెళ్లి ఎలా రిజిస్ట్రేషన్ చేశారని మహా అడుగుతుంది . నీ ఐడి ప్రూవ్ ఆధార్ నీ భర్త దగ్గరే ఉంది కదా అని అతను చెప్పగానే మహా షాక్ అవుతుంది. అంటే చక్రి నాతో అబద్ధం చెప్పాడా అని మహా షాక్ అవుతుంది. మరొకవైపు మనీషాకి తన ఇంట్లో వాళ్ళు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు.. తనకి వద్దని తన అన్నతో చెప్తూ ఏడుస్తుంటే అప్పుడే మాధవ వచ్చి తనకి నచ్చిన వాళ్ళకి ఇచ్చి చెయ్యమని చెప్తాడు.

మరొకవైపు మహా బర్త్ డే సర్ ప్రైజ్ అని  చక్రి ప్లాన్ చేస్తాడు. ఇల్లంతా బెలూన్లతో డెకరేషన్ చేస్తాడు. మహా, విక్కీ ఇంటికి వస్తారు. కరెక్ట్ టైమ్ కి వచ్చానన్నమాట అని విక్కీ అనుకుంటాడు. బర్త్ డే కి మహా కోసం శైలు గిఫ్ట్ తీసుకొని వస్తుంది. మహాకి శైలు విషెస్ చెప్తుంది. తరువాయి భాగంలో మహాకి చక్రి ప్రపోజ్ చేస్తాడు. నీలాంటి ఫ్రాడ్ ని ఎవరు ప్రేమిస్తారని మహా అనగానే చక్రి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.ఘట్ కేసర్ దగ్గరికి రా అమ్మ అని చెప్తాడు. ఆ తర్వాత విక్కీ దగ్గరికి పర్మిషన్ అడగాలని మహా వెళ్తుంది. తను కూడా ఘట్ కేసర్ సైడ్ వెళ్తున్నానని నాతో రా అని విక్కీ అనగానే మహా సరే అంటుంది. మరొకవైపు మహా బర్త్ డే అని ఇల్లంతా బెలూన్స్ తో నింపేస్తాడు చక్రి. తరువాయి భాగంలో ధర్మేంద్రని మహా కలుస్తుంది. అన్ని నిజాలు తెలుసుకుంటుంది. చక్రి ఫోన్ చెయ్యమంటేనే నీకు కాల్ చేసానని కానిస్టేబుల్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com