జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -312 లో.....రుద్ర దగ్గరికి గంగ వస్తుంది. నువ్వు ముందు వెళ్లి ప్రాక్టీస్ చెయ్యమని రుద్ర చిరాకు పడుతాడు. గంగ వెళ్ళిపోతుంది. ఏంటి బావ నువ్వు అంటే చెల్లికి ఎంత ఇష్టమని రంగా అంటాడు. నాకు తెలుసు ఇలా మాట్లాడితేనే మీ చెల్లి వింటుందని రుద్ర అంటాడు. అబ్బా ఎంత గొప్ప జంట.. తనకి నీ ఆశయం ముఖ్యం నీకు దాని భవిష్యత్తు ముఖ్యం అని రంగా అంటాడు.
మరొకవైపు నాకు ఒక చీర కావాలి.. రెండు లక్షలు ఇవ్వమని రాఘవని ఇందుమతి అడుగుతుంది. మొన్నే నీ కొడుకు బిజినెస్ అని నష్టం తెచ్చాడు.. డబ్బులు లేవని రాఘవ అంటాడు. అప్పుడే ఇషిక, సూర్య వచ్చి మేం మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నామని అడుగుతారు. ఏం అవసరం లేదు మొన్న తెచ్చిన నష్టం చాలు అని రాఘవ అంటాడు. ఇప్పుడు ఒకవేళ బిజినెస్ చేసినా రుద్ర ఒప్పుకుంటేనే అది జరగాలని రాఘవ చెప్తాడు. ఇందుమతి కూడా అదే చెప్తుంది. చూసావా నీ వల్ల మళ్ళీ రుద్ర అన్నయ్య కాళ్ల కిందకే వెళ్ళాల్సి వస్తుందని ఇషికపై సూర్య కోప్పడతాడు. అదేంటి సూర్య మళ్ళీ మొదటికి వస్తావని ఇషిక అంటుంది.
ఆ తర్వాత ఇషిక డల్ గా కూర్చొని ఉంటే వీరు వచ్చి ఏమైందని అంటాడు. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే రుద్ర బావ పర్మిషన్ కావాలంట.. మా మావయ్య ఆర్డర్ పాస్ చేసాడని ఇషిక చెప్తుంది. అయితే ఏంటి మంచిదేగా అని వీరు అంటాడు.మరొకవైపు గంగ కాంపిటీషన్ లో స్ట్రాంగ్ గా ఉండాలంటే తనకి సున్నుండలు చెయ్ అని లక్ష్మీతో పైడిరాజు చెప్తాడు. అదంతా జయ విని మీరు అందరు గంగ, రుద్రకి సపోర్ట్ కదా.. మీ సంగతి చెప్తానని జయ అనుకుంటుంది. తరువాయి భాగంలో పైడిరాజు చేత జయ తన చెప్పు కుట్టించుకొని తీసుకొని రమ్మని చెప్తుంది. అప్పుడే గంగ వస్తుంది. విశ్వ వాళ్ళకి విషయం చెప్తుంది. దాంతో వాళ్ళకి జయ చేత సారీ చెప్పిస్తాడు విశ్వ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Jayam Serial Today Episode, Zee Telugu Jayam Serial Highlights, Rudra Ganga Jayam Serial, Jayam Serial Latest Updates, Telugu Serial Gossip TeluguOne.




