స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -48 లో......వేలంపాట ఆపకుండా దొరబాబు వేలంపాట పాడుతూనే ఉంటాడు. వేలం కోటికి చేరుతుంది ఇప్పుడు ఒకవేళ పాట ఆగితే మనం కట్టాల్సి ఉంటుందని నందు, శారదా టెన్షన్ పడుతారు. బ్రో కొంచెం చూసుకొని పాడు అని దొరబాబుకి మురళి చెప్తాడు. మరొకవైపు పురిటి నొప్పులు పడుతున్న ఒకావిడకి జానూ డెలివరీ చేస్తుంది. మగబిడ్డ పుడతాడు. మాకు నువ్వు సాయం చేసావ్ ఈ బిడ్డకి నువ్వే పేరు పెట్టు అని ఆవిడ అనగానే శంకర్ నారాయణ అని జాను వాళ్ళ నాన్న పేరు పెడుతుంది.
మరొకవైపు వేలంపాట దొరబాబు కోటి ఇరవై లక్షలకి పాడుతాడు. వేలం ముగుస్తుందనే టైమ్ కి సూర్య లాయర్ ని తీసుకొని వస్తాడు. వేలం పూర్తి అయింది ఇప్పుడు స్టే ఆర్డర్ చెల్లదని మేనేజర్ అంటాడు. ఎందుకు చెల్లదు ఇంకా సంతకాలు పూర్తి అవ్వలేదు.. ఇప్పుడు మీరు వేలం ఆపకుంటే తిరిగి కేసు పెడుతాం.. వాళ్ళకి ఇంటిని వేలం వేస్తున్నాని నోటిస్ కూడా ఇవ్వలేదని లాయర్ అంటుంటే మేనేజర్ భయపడతాడు. దాంతో వేలం ఆపేస్తారు. శంకర్ బ్యాంక్ కి ఉన్న లోన్ డబ్బు నందు ఇస్తుంది. ఇల్లు తాళాలు శారదాకి ఇస్తారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
శారదా ఇంట్లోకి వెళ్లి ఎమోషనల్ అవుతుంది ఇదంతా జానూ వల్లే అని సూర్య అంటాడు. ఇంతకి అక్క ఎక్కడ అని కిన్నెరా అడుగుతుంది. దాంతో సూర్య విషయం చెప్తాడు. ఆ తర్వాత కాసేపటికి జానూ వస్తుంది. ఇంట్లోకి వెళ్లి ఎమోషనల్ అవుతుంది. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు తరువాయి భాగంలో నీ వల్లే ఇదంతా చేసాను.. నాతో ఎప్పుడు తోడుగా ఉంటావా అని సూర్యతో జానూ అంటుంది. నువ్వు వెళ్లమన్నా వెళ్ళనని సూర్య అనగానే జానూ తనని హగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Godhavari Serial Today Episode, Star Maa Godhavari Serial Telugu, Janu Surya Romance Godhavari, Godhavari Serial Latest Highlights, Telugu Serial News TeluguOne.




