Home

»

Tv News

Jayam Serial: వీరు ట్రాప్‌లో చిక్కుకున్న సూర్య, ఇషిక.. రుద్ర అలర్ట్!

Jun 26, 2026 10:24AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్- 304 లో.. రుద్ర, గంగ, రంగ ముగ్గురు గదిలో మాట్లాడుకుంటారు. శకుంతల అమ్మగారు మాట్లాడుతుంటే ఇషిక డల్ గా వెళ్లిపోయింది. ఏదో జరిగిందని రంగ డౌట్ గా అంటాడు. అవును నాకు అదే డౌట్ వచ్చిందని రుద్ర అంటాడు. ఇషిక, సూర్య వచ్చినప్పుడు వీరు కావాలనే ఇషికని పొగిడినట్టుగా మాట్లాడాడు. కానీ దానిలో ఇషికని హేళన చేసినట్టుగా ఉందని రుద్ర అంటాడు. ఎందుకని అని గంగ అడుగుతుంది. అదే ఏదో జరిగినట్టుంది.. ఒక పని చెయ్ రంగా.. నువ్వు వెళ్ళి ఇషిక, సూర్య అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. ఇది ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా చేయమని రంగతో రుద్ర చెప్తాడు.

రంగా తెలుసుకుంటానని వెళ్తాడు. ఆ తర్వాత గంగ, రుద్ర మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఏం అవుతుందని గంగ అడుగుతుంది. ఒకవేళ ఇషిక, సూర్య అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతే డబ్బు పోవడమే కాదు.. మన కంపెనీ రెపుటేషన్ కూడా పోతుందని రుద్ర అంటాడు. మరి ఇప్పుడు ఎలా అ‌ని గంగ అంటుంది.  ఇషిక, సూర్యలని ఎవరో మిస్ గైడ్ చేసి ఇలా చేయించారని రుద్ర అంటాడు. వీరు దగ్గరికి ఇషిక, సూర్య వెళ్తారు. నీ వల్లే ఆ ప్రాజెక్ట్ ఒప్పుకోవాల్సి వచ్చిందని ఇషికని సూర్య తిడతాడు. అప్పటికైనా రుద్ర అన్నయ్య చెప్తూనే ఉన్నాడు. అది ఫ్రాడ్ కంపెనీ అని నేనే వినలేదని సూర్య అంటాడు. అప్పుడు నా వల్లే ప్రాజెక్టు వచ్చిందని పొగిడావ్.. ఇప్పుడు ఇలా అయ్యేసరికి నన్ను బ్లెమ్ చేస్తున్నావా అని ఇషిక అంటుంది. ఏం చేస్తావో నువ్వే చేయ్ బావ అని వీరుతో సూర్య అంటాడు. ఆ తర్వాత ఇద్దరు రిక్వెస్ట్ చేస్తారు. నేను చూసుకుంటానని వీరు అంటాడు.

పెద్దసారు, ప్రమీల సూపర్ మార్కెట్ కి వెళ్తారు. పెద్దసారు కోపంగా రావడం చూసిన మక్కమ్ కంగారుపడతాడు. కార్తీక్ విషయం గురించి ఏమైనా పెద్దసారుకి తెలిసిందా అని మక్కమ్ భయపడతాడు. ఇప్పుడు ఇందులో నుండి నన్ను కాపాడేదెవరని మక్కమ్ ఆలోచిస్తాడు. అప్పుడే అతనికి రంగా గుర్తొచ్చి వెంటనే రంగాకి మక్కమ్ కాల్ చేసి..  వెంటనే నువ్వు సూపర్ మార్కెట్ కి రా అని చెప్తాడు. వెంటనే రంగా వచ్చి.. అసి అయ్యగారు.. కార్తీక్.. కళ్ళు అని రంగా చెప్పబోతుంటే అప్పుడే రుద్ర వచ్చి తనని ఆపి కవర్ చేస్తాడు. దొంగలు ఎక్కువయ్యారని సీసీటీవీ చెక్ చేయడానికి వచ్చానని పెద్దసారు అనగానే అందరు మామూలు అవుతారు.  ఆ తర్వాత అందరు ఇంటికి వెళ్తారు. ‌అప్పుడే పెద్దసారు కోసం వాళ్ళ ఇంటికి లాయర్ వస్తాడు. ఏంటా అని అందరు ఆలోచిస్తుంటారు. కాఫీ తాగుతారా అని లాయర్ ని పెద్దసారు అడుగుతాడు. ‌ఇప్పుడు అలాంటి మర్యాదల కోసం నేను ఇక్కడికి రాలేదని అతను చెప్తాడు. ఏంటి విషయం అని పెద్దసారు అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com