Home

»

Tv News

రోజాపై అనిల్ రావిపూడి పంచుల వర్షం!

Jun 25, 2026 3:58PM

డ్రామా జూనియర్స్ లేటెస్ట్ సీజన్ లో పిల్లలు బాగా కామెడీ చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు. అలాగే జడ్జెస్ కూడా ప్రతీ వారం రకరకాల గెటప్స్ తో వస్తూ అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు రెట్రో గెటప్స్ తో వచ్చారు. ఈ ప్రోమో కామెడీగా ఉంది. " రాధా గోపి అంటూ స్టేజి మీద శ్రీకాంత్, రోజా పిలుచుకుంటూ మైమరిచిపోతూ ఉన్నారు. ఇంతలో అనిల్ రావిపూడి నాగేశ్వరావు గెటప్ లో వచ్చి " నాన్‌సెన్స్.  ఈ పేర్లతో పిలుచుకుంటే మీకున్న పేరు పోతుంది" అనేసరికి రోజా మూతి తిప్పింది.

" గోపి  నా హెయిర్ బ్యాండ్ ఎలా ఉంది? " అని అడిగిడిని. "వడదెబ్బ తగిలినప్పుడు తడిగుడ్డ కట్టినట్టుంది రాదా?" అన్నారు శ్రీకాంత. " నాన్న గారు నాన్న గారు " అంటూ రోజా అనిల్ రావిపూడి అని పిలుస్తూ వచ్చేసరికి "నాన్‌సెన్స్. నానా   కష్టాలు పడి ఇక్కడికొస్తే నీతో నాన్న అనిపించుకోవడానికా?  . ఎన్ని టాబ్లెట్స్ వేసావ్ ఏంటి " అన్నారు అనిల్ రావిపూడి కామెడీగా. " మామయ్య, మావయ్య." అంటూ శ్రీకాంత్ పిలిచేసరికి అనిల్ ఫీలైపోయారు.

"జాబిలమ్మలా ఉంది చూడండి " అంటూ రోజాను చూపిస్తూ అన్నారు శ్రీకాంత్. " ఇప్పుడు చూసినప్పుడు జాబిలమ్మ లాగే ఉంటుంది. ఏదైనా రాంగ్  టైంలో చూస్తే జేజెమ్మలా ఉంటుంది" అన్నారు అనిల్. తర్వాత ఊరిపెద్దగా హోస్ట్ సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. "ఈ దారుణం కంటే ఆవిడ నన్ను నాన్న అని పిలవటమే బాగుంది" అని అనిల్ అక్కడినుంచి వెళ్లిపోయారు .  తర్వాత స్టేజి మీద అనంత శ్రీరామ్ దూకుతూ వచ్చారు. " ఆ ఫ్లూట్ కి కొంచెం దూరంగా ఉండండి. ఫ్లూట్ ఏదో నువ్వేదో తెలియట్లేదు" అని రోజా సెటైర్ వేశారు. "ఆ డ్రమ్ లకు  కొంచెం దూరంగా ఉండండి." అంటూ రివర్స్ కౌంటర్ వేసాడు అనంత శ్రీరామ్.  

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com