Home

»

Tv News

Jayam serial : గంగ బాక్సింగ్ విక్టరీ.. సుధాను చూసేసిన విశ్వ.. పైడిరాజుకు తప్పని తిప్పలు!

Jun 5, 2026 11:14AM


జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -286 లో.. గంగకి బాక్సింగ్ పోటీ మొదలవుతుంది. ఆ పోటీని చూడటానికి పెద్దసారు, లక్ష్మీ, సుధా, శకుంతల, ఇషిక, వీరు వస్తారు. అయితే శకుంతలకి తెలియకుండా పెద్దసారు, పెద్దసారుకి తెలియకుండా శకుంతల వస్తారు. మరోవైపు సుధా, లక్ష్మీ ఒక దగ్గర ఉంటారు. గంగకి అప్పోజిట్ గా ఉన్న బాక్సర్ కి ధీరజ్ కోచ్ గా ఉంటాడు. ఎలాగైనా గంగని ఓడించాలని ఆమెకి ధీరజ్ చెప్తాడు‌. 

ఇక పోటీ మొదలవుతుంది మొదటి రౌండ్ లో గంగ, అప్పోజిట్ బాక్సర్ ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ సాగుతుంది. మొదటి రౌండ్ లో గంగకి బాగా గాయాలవుతాయి అప్పోజిట్ అమ్మాయి లీడ్ లో ఉంటుంది. దాంతో రుద్ర మోటివేట్ చేస్తాడు. సెకెండ్ రౌండ్ లో గంగ గెలుస్తుంది. ఇక మూడో రౌండ్ కి గంగకి మత్తు మొదలవుతుంది. అసలు ఏం అయిందంటే గంగ తీసుకునే టూత్ ప్యాక్ ఉన్న వాటర్ లో వీరు మత్తుమందు కలుపుతాడు. దాంతో గంగకి మత్తుతో కళ్ళు సరిగ్గా కనపడక దెబ్బలు తిని కిందపడుతుంది. ఇక తనని మోటివేట్ చేసిన రుద్రని, విశ్వతో చేసిన ఛాలెంజ్ ని గుర్తుచేసుకొని మళ్ళీ సంకల్పంతో ఆడుతుంది. మరోవైపు తనని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన శకుంతలకి అనుకోకుండా పెద్దసారు కనపడతాడు. దాంతో పక్కకి వెళ్తుంది శకుంతల. అక్కడ సుధా, లక్ష్మీ ఉంటారు. వదిన బాగున్నావా అంటు సుధా పలకరించగా.. ఆ మాట అనకు.. నిన్ను నా తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చేసుకోవాలని అనుకోవడమే నేను చేసిన తప్పు అంటు గతంలో జరిగింది గుర్తుచేస్తూ సుధాని బాధపెడుతుంది శకుంతల. మీలో బాధ ఉంది వదిన.. ఎన్ని తిట్టినా పడతానని సుధా అనగానే ఛీ అంటూ శకుంతల అక్కడ నుండి వెళ్ళిపోతుంది. దాంతో సుధా బాధపడుతుంది. ఇక ఆ తర్వాత సుధాని విశ్వ చూసేస్తాడు.

దాంతో వెళదామని లక్ష్మీతో సుధా అనగానే గంగ బాగా ఆడుతుంది అమ్మా.. ఉందామని లక్ష్మీ అంటుంది. ఇక ఇద్దరు బాక్సింగ్ చూస్తారు. ఆ తర్వాత పోటీలో గంగ విజయం సాధిస్తుంది. ఇక గంగని అందరు అభిమానిస్తారు. మరోవైపు పోటీని ఇంట్లో ఉండి టీవీలో చేస్తుంటారు. సుధా, పెద్దసారు, లక్ష్మీ కలుసుకొని మాట్లాడుకుంటారు.ఇక విశ్వ చూసాడని తొందరగా వెళదామని సుధా, లక్ష్మీ అనుకుంటారు. ఇక మీడియా వాళ్ళు వచ్చి గంగని పొగుడుతారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ రుద్ర గర్వంగా చెప్తాడు. ఆ తర్వాత ఇషిక, వీరు దగ్గరికి గంగ వెళ్ళి .. ఏంటి అన్నయ్య మీ ప్లాన్ ఫెయిల్ అయిందా డిస్సప్పాయింట్ అయ్యారా అని అనగానే మేం ఎందుకు డిస్సప్పాయింట్ అవుతాం గంగా అని ఇషిక అంటుంది. దాంతో తన చెంపచెల్లుమనిపిస్తుంది గంగ. మీరు నా టూత్ ప్యాక్ లో మత్తు కలిపారని నాకు తెలుసు.. నాకు అది పెట్టుకోగానే మత్తు వచ్చింది..‌ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే బాగోదని ఇద్దరికి గంగ వార్నింగ్ ఇస్తుంది. ఇక గంగ దగ్గరికి పెద్దసారు వచ్చి కంగ్రాట్స్ చెప్తాడు. పెద్దమ్మ కూడా వచ్చిందని చెప్పగానే పెద్దసారు చూసి.. నాకు వద్దని చెప్పి నాకు తెలియకుండా నువ్వు వస్తావా నీ పని చెప్తానని పెద్దసారు అనుకుంటాడు. ఆ తర్వాత విశ్వ కార్ లో కూర్చుంటాడు. గంగ వాళ్ళ నాన్న పైడిరాజు డ్రైవింగ్ సీట్ లో కూర్చోబోతుండగా తనని ఆపి.. వాళ్ళని కూడా వచ్చి కార్ లో కూర్చోమని విశ్వ అంటాడు. ఎవరు సర్ అని పైడిరాజు అనగానే విశ్వ కోపంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com