Home

»

Tv News

Illu illalu pillalu: పంతం వీడని ధీరజ్.. ప్రేమకు తప్పని తిప్పలు!

Mar 25, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-427 లో.. శ్రీవల్లిని ఆటపట్టించినందుకు ప్రేమ, నర్మద ఇద్దరు ఫుల్ గా నవ్వుకుంటారు. అయితే ఎక్కువగా నవ్వడం వల్ల ప్రేమకి కడుపునొప్పి వస్తుంది. ఏం అయిందని నర్మద అడుగగా.. గత రెండు రోజులుగా అన్నం తినకపోయేసరికి కడపునొప్పి వస్తుందని ప్రేమ చెప్తుంది. దాంతో ప్రేమని నర్మద ఓదారుస్తుంది.

ఇక ప్రేమ అలా బాధపడటం, నర్మద ఓదార్చడం వేదవతి చూస్తుంది. ఇక కాసేపటికి ధీరజ్ దిండు, దుప్పట్లు పట్టుకొని బయటకు వెళ్తుంటే తనని ఆగమని చెప్తుంది నర్మద. అసలు నువ్వేం చేస్తున్నావో తెలుసా.. ఎందుకు ప్రేమతో మాట్లాడటం లేదని ధీరజ్ ని నర్మద అడుగుతుంది. నా చెల్లెలు జీవితం ఇలా అవ్వడానికి కారణం తనే.. తన ముఖం చూడాలనిపించడం లేదని ధీరజ్ అనగానే నువ్వు మాట్లాడటం లేదని గత రెండు రోజులుగా తను ఏం తినలేదని నర్మద అంటుంది. నాకు సంబంధం లేదు అన్నట్టుగా ధీరజ్ వెళ్లిపోతుంటే వేదవతి ఆపుతుంది. ప్రేమని తినమని చెప్పరా అని అడుగుతుంది. నా నిర్ణయంలో ఏం మార్పు లేదు.. నేను తనతో మాట్లాడను అమ్మ అని ధీరజ్ అనగానే వేదవతి ఏం చేయలేకపోతుంది. ఆ తర్వాత ప్రేమ, నర్మదల దగ్గరికి వేదవతి అన్నం తోసుకొని వస్తుంది. తినమబి ప్రేమని అడుగగా నాకు వద్దు అత్తయ్య అంటుంది. వేదవతి దబాయించి తినిపిస్తుంది‌. ఆ తర్వాత నర్మదకి కూడా వేదవతి తినిపించడంతో ఇద్దరు ఎమోషనల్ అవుతారు.

ఇక ధీరజ్ బయట పడుకుంటే తన పక్కనే తిరుపతి వచ్చి పడుకుంటాడు. మరోవైపు రామరాజు, వేదవతి ఇద్దరు తమ గదిలో పడుకొని ఉండగా.. శ్రీవల్లి చేసిన పనికి రామరాజు అలా అయిపోవడం తల్చుకొని ఒక్కసారిగా భయపడి ఉలిక్కిపడి లేస్తుంది. ఏమైందని రామరాజు అడుగగా వల్లి అని చెప్తుంటే అవును వల్లి మంచి కోడలు.. నేను సెలెక్ట్ చేసిన కోడలు అని రామరాజు గొప్పగా చెప్తుంటే వేదవతి అసలు నిజం చెప్పలేకపోతుంది. మరోవైపు ధీరజ్, తిరుపతి ఇద్దరు దుప్పట్లు కప్పుకొని బయట పడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ప్రేమ వస్తుంది. నాతో‌ మాట్లాడకుండా ఇక్కడ పడుకుంటావా అని అక్కడ ఉన్న చిన్న చిన్న వస్తువులతో ధీరజ్ ని కొడుతుంది కానీ పడుకుంది తిరుపతి‌. దాంతో అతము లేచి వామ్మో వాయ్యో అని అరుస్తాడు. మీ ఫాంటసీ ఏంటమ్మా అంటూ తిరుపతి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ధీరజ్ ని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. గదిలోకొచ్చి ధీరజ్ ని పడుకోమని ప్రేమ అంటే ధీరజ్ పంతంతో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com