Home

»

Tv News

Illu illalu pillalu : వల్లికి నర్మద మైండ్ బ్లాకింగ్ షాక్.. ఏఐ వీడియోతో ప్లాన్ రివర్స్!

Aug 5, 2026 10:12AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -541 లో......వేదవతి అటుఇటు తిరుతుంటే ఏంటి అత్తయ్య అని నర్మద వస్తుంది. మీ మావయ్య గారు బయటకి వెళ్ళేటప్పుడు నన్ను ఎదురు రమ్మంటారు కదా అందుకే వెయిట్ చేస్తున్నానని వేదవతి అంటుంది.‌ అప్పుడే రామారాజు వచ్చి అమూల్య అని పిలుస్తాడు. అమూల్య లేదు మావయ్య అని వల్లి చెప్తుంది. అయితే బయటకు వెళ్తున్న ఎదురురా అమ్మ అని వల్లితో రామరాజు అంటాడు.

అత్తయ్య గారు ఉండగా నేను ఎందుకు అని వల్లి అంటుంది. ఏం పర్లేదురా అని రామరాజు అనగానే వల్లి సరే అంటుంది. అప్పుడే చందు వచ్చి అమ్మ ఏదో చేసిందని మీ నమ్మకం పక్కన పెట్టడం ఎందుకు అమ్మే ఎదురు వస్తుందని చందు అంటాడు. అమ్మ నువ్వు వెళ్ళు అని చందు చెప్పగానే వేదవతి ఎదురు వస్తుంది. అప్పుడే వేదవతి వాళ్ళ అమ్మ వస్తుంది. నా కూతురు తన మేనకోడలు పరువు గురించి అలోచించి అలా చేసింది క్షమించండి బాబు అని రామరాజుతో అంటుంది కానీ రామరాజు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఈ పుట్టినరోజు జరగపోయినా బాగుండేది అని పెద్దావిడ అంటుంది. మొదట భద్రవతి ఒప్పుకోలేదు.. తర్వాత ఒప్పుకుంది పుట్టినరోజు జరిపించడానికి అని పెద్దావిడ అనగానే నర్మదకి డౌట్ వస్తుంది. ముందు ఒప్పుకోలేదు అంటే తర్వాత ప్లాన్ ప్రకారం ఇదంతా చేసి ఉంటారని అంటుంది. దాంతో వల్లికి టెన్షన్ మొదలు అవుతుంది. ఇందులో ఏదో ఉంది అత్తయ్య కనిపెడుతానని నర్మద అంటుంది.ఆ తర్వాత భద్రవతి, వల్లి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్న వీడియోని వల్లికి నర్మద చూపిస్తుంది. అది చూసి వల్లి షాక్ అవుతుంది మీరు ఇద్దరు ఇంటి వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారని అడుగుతుంది. మేం మాట్లాడుకుంది గార్డెన్ లో కదా అంటే ఒక రాయి వేస్తుంది అన్నమాట అని ఆ వీడియోని చూసి ఇది ఏఐ వీడియో అని చెప్తుంది‌. అవును నేనే క్రియేట్ చేసాను దీన్ని బట్టి నీ రియాక్షన్ చూద్దామని అనిపించిందని నర్మద అంటుంది. నాకేం తెలియదని వల్లి చెప్తుంది.

మరొకవైపు ప్రేమ ఇని స్టిట్యూట్ వెళ్లిందో లేదో అని ధీరజ్ వెళ్తాడు. అక్కడ ధీరజ్ ని సెక్యూరిటి ఆపుతాడు. ఆ అమ్మాయి తెలిసిన అమ్మాయి అని ధీరజ్ అంటాడు. ప్రేమ మాత్రం అతను ఎవరో తెలియదని చెప్పి  వెళ్ళిపోతుంది. మరొకవైపు అమూల్యతో విశ్వ మాట్లాడాలని ట్రై చేస్తాడు. నువ్వు నాతో మాట్లాడడం ఏంట్రా అని అమూల్య కోప్పడుతుంది. ప్రేమ, ధీరజ్ గురించి అని విశ్వ అనగానే అమూల్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.SEO 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com