Home

»

Tv News

Illu illalu pillalu : వల్లి చేతికి చిక్కిన బలవంతపు పెళ్లి వీడియో.. భద్రవతితో కలిసి కొత్త ప్లాన్!

Jul 19, 2026 9:50AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -527 లో.... శ్రీవల్లికి భాగ్యం ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. వాళ్ళ బలవంతపు పెళ్లికి సంబంధించిన వీడియో కూడా ఉందని భాగ్యం చెప్పగానే త్వరగా పంపిమని వల్లి అంటుంది. భాగ్యం పంపించగానే వల్లి ఆ వీడియో చూసి ఈ ఆధారం చాలు గొడవ చెయ్యడానికి అని అనుకుంటుంది. ఇప్పుడే ఇది మావయ్య కి చూపిస్తానని వెళ్తుంటే తన అంతరాత్మ ఆపుతుంది. నువ్వు ఈ వీడియో మీ మావయ్యకి చూపిస్తే నా కొడుకు మంచి పని చేసాడని అనుకుంటాడు కానీ ఈ వీడియో చూపించాల్సిన వాళ్ళకి చూపిస్తేనే కదా అసలు మజా అని అనగానే ఎవరికి చూపించాలో నాకు తెలుసని వల్లి అనుకుంటుంది.

ఆ తర్వాత అందరు పడుకున్నాక వల్లి భద్రవతి ఇంటికి వెళ్లి గుమ్మం దగ్గరుండి భద్రవతికి ఫోన్ చేసి బయటకి రమ్మంటుంది. భద్రవతి వచ్చాక ప్రేమ మెడలో ధీరజ్ బలవంతంగా తాళి కట్టే వీడియోని చూపిస్తుంది. అది చూసి భద్రవతి షాక్ అవుతుంది. కళ్యాణ్ అనే అతన్ని ప్రేమ ప్రేమించి లేచిపోయింది. వాడు మోసం చేసి పోయాడు. మీ చెల్లి వేదవతి గారు తెలివిగా తన కొడుకు చేత తాళి కట్టించిందని చెప్పగానే ఇప్పుడే నా మేనకోడలిని తీసుకొని వస్తానని భద్రవతి అంటుంది. అప్పుడు అంటే ప్రేమకి ధీరజ్ అంటే ఇష్టం లేదు కానీ ఇప్పుడు చాలా ప్రేమ ఉంది.. అంత ఈజీగా రాదని వల్లి చెప్తుంది. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలని భద్రవతి అడుగుతుంది.

రేపు మీ అమ్మ పుట్టినరోజు కదా ఒక మెట్టు దిగినట్లు యాక్టింగ్ చెయ్యండి అని వల్లి ఏదో ప్లాన్ చెప్తుంది. మరొకవైపు ధీరజ్ ని ఎవరో కత్తితో పొడిచినట్లు ప్రేమకి కల వస్తుంది. దాంతో ప్రేమ భయపడుతుంది. అలా ఏం కాదని ధీరజ్ ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత పెద్దావిడ వేదవతి ఇంటికి వస్తుంటే వల్లి చూసి పర్లేదు భద్రవతి మన ప్లాన్ అమలు చేస్తుందన్నమాట అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com